Megastar: మరో ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన చిరు..!

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న చిరు తర్వాత బింబిసార సినిమా డైరెక్టర్ వశిష్ట మల్లిడి కి నెక్స్ట్ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడంటూ వార్తలొచ్చాయి. అయితే, ఈ కాంబినేషన్ పై మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరో యంగ్ డైరెక్టర్ కి చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో డైరెక్టర్ గా మారిన కళ్యాణ్ కృష్ణ కురసాలకు నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చాడన్నది ఆ వార్తల సారాంశం. సోగ్గాడే చిన్ని నాయన సినిమా మినహా తన కెరీర్లో ఒక హిట్ కూడా లేని ఫ్లాప్ డైరెక్టర్ కి చిరు ఛాన్స్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిజానికి చిరంజీవితో సినిమా చేసేందుకు పూరీ జగన్నాధ్, త్రివిక్రమ్ వంటి సీనియర్ డైరెక్టర్లు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. సీనియర్లను కాదని ఇలా వరుసగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వటం వెనక చిరు ఉద్దేశం ఏమయ్యుంటుంది అన్న డిస్కషన్ మొదలైంది సోషల్ మీడియాలో. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ చిరు ఆలోచనలో మార్పు తెచ్చిందని అంటున్నారు. ఆ ప్రభావం వల్లే చిరంజీవి తన నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా చిరంజీవి చాలా మంది డైరెక్టర్లతో స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నారని సమాచారం అందుతుంది.
భోళా శంకర్ సినిమా రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ ని బట్టి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలన్నది డిసైడ్ అవ్వాలని చిరంజీవి ప్లాన్ అని అంటున్నారు. అందుకే చిరంజీవి సినిమాల విషయంలో ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నారట. గాడ్ ఫాదర్ సినిమా సమయంలో పూరీతో సినిమా చేసే విషయంపై సానుకూలంగా స్పందించిన చిరంజీవి ఆ తర్వాత మళ్ళీ ఆ ఊసు ఎత్తలేదు. మరి, పూరీ చిరు వద్దకు తీసుకొని వెళ్లాడా లేదా అన్నది తెలియాలి. చిరంజీవి కళ్యాణ్ కృష్ణకు ఛాన్స్ ఇచ్చాడంటూ వస్తున్న వార్తలు ఫ్యాన్స్ లో కొంత ఆందోళన సృష్టించింది. మరి, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వేచి చూడాలి.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు