దర్శకులను నమ్మిన హీరోలు కొందరు ఉంటారు. దర్శకత్వంలో వేలు పెట్టే హీరోలు కూడా కొందరు ఉంటారు. ఒక్కొసారి వీళ్ల వల్లే దర్శకుడు అనుకున్న కథ పక్క తొవ పట్టి సినిమా ఫలితాల్లో తేడా కొడుతుంది. దీనిలో మెగా ఫ్యామిలీ హీరోలే కాస్త ముందుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసే సినిమా స్టోరీలో మార్పులు జరగడం కొత్తమీ కాదు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మధ్య కాలంలో ఇలాగే చేస్తున్నారని, దాని ఫలితమే “ఆచార్య” అని చెప్పొచ్చు.
“ఆచార్య” ఫలితం తర్వాత మెగాస్టార్ మళ్లీ కథలో వేలు పట్టాలని అనుకోవడం లేదట. డైరెక్టర్లు ఏది చెప్పినా చేయడానికి రెడీ అవుతున్నాడట. అయితే తనకు మాస్ ఎలివేషన్స్, కమర్షియల్ సినిమాలు కావాలని డైరెక్టర్స్ కు కండిషన్స్ పెడుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. కమ్ బ్యాక్ మూవీ “ఖైదీ నెంబర్ 150” తోపాటు “గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు” లాంటి రిజల్ట్ కావాలని అంటున్నాడట.
చిరంజీవి ప్రస్తుతం బాబి డైరెక్షన్ “వాల్తేరు వీరయ్య”, మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్” సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. “వాల్తేరు వీరయ్య” మూవీలో చిరు క్యారేక్టర్ డిజైన్ లో బాబి ప్రత్యేక శ్రద్ద పెట్టారని తెలుస్తుంది. సూపర్ మాస్ ఎలివేషన్స్ తో కూడిన స్టోరీ రెడీ చేశాడట. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
అలాగే తమిళ మూవీ “వేదాళం” రీమేక్ గా వస్తున్న “భోళా శంకర్” మూవీని కమర్షియల్ గా తెరకెక్కించాలని మెహర్ రమేష్ ప్లాన్ చేస్తున్నాడని వినిపిస్తుంది. చిరు టేస్ట్ కు అనుగుణంగా వస్తున్న ఈ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్స్ కొడుతాయో చూడాలి మరి.