Aa Okkati Adakku : వాయిదా తప్పదు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఈవీవీ సత్యనారాయణ పేరు చెప్పగానే హాస్య సినిమాలతో పాటు విభిన్నమైన చిత్రాలు గుర్తుకొస్తాయి. అయితే 1993లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హాస్య చిత్రం ఆ ఒక్కటి అడగకు. ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో రాజేంద్రప్రసాద్, రంభ ప్రధానపాత్రలు పోషించారు. ఇతర పాత్రలలో రావు గోపాలరావు, నిర్మలమ్మ, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఇదే సినిమాని 1997లో మిస్టర్ అండ్ మిసెస్ కిలాడి పేరుతో హిందీలో రీమేక్ చేశారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..
అటుకుల చిట్టిబాబు (రాజేంద్ర ప్రసాద్) అదృష్టాన్ని, జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్మే వ్యక్తి. తనకి రాసి పెట్టుంటే అది ప్రయత్నం చేయకపోయినా ఖచ్చితంగా జరిగి తీరుతుందన్న నమ్మకం అతనిది. దానికి తోడు పూంపుహార్ (బాబు మోహన్) అనే జ్యోతిష్కుడు అతనికి కొద్ది రోజుల్లో రాజయోగం పడుతుందని చెబుతాడు. దాంతో చిట్టిబాబు ఎం. ఏ చదివినా ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా రాజయోగం కోసం కలలు కంటుంటాడు.

ఇకపోతే ప్రస్తుతం ఇదే పేరుతో అల్లరి నరేష్ కూడా ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అల్లరి నరేష్ కొంచెం డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తున్నాడు. కానీ ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలు అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు అన్నీ హస్యకరమైన సినిమాలను చేశాడు అల్లరి నరేష్. అల్లరి నరేష్ సినిమా వస్తుంది అంటే చాలు మినిమం గ్యారెంటీ ఉంటుందని అప్పట్లో ఆడియన్స్ అంతా థియేటర్ కి వెళ్లిపోయేవాళ్ళు.

- Advertisement -

అయితే రీసెంట్ టైమ్స్ లో అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలను చేయటం మొదలుపెట్టాడు. అలా అల్లరి నరేష్ చేసిన నాంది, ఉగ్రం సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకున్నాయి. ఇకపోతే ఇప్పుడు చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ తో సినిమాను చేస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను మార్చి 22న రిలీజ్ చేయనున్నట్లు. ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా వాయిదా పడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఈ మార్చి మంత్ లో చాలా సినిమాలు థియేటర్ వద్ద రిలీజ్ కి రెడి గా ఉన్నాయి. అన్నిటికంటే సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి
ఈ సినిమా మార్చ్ 29న రిలీజ్ కానుంది.

మార్చ్ 22న రిలీజ్ కాబోయే ఆ ఒక్కటి అడక్కు సినిమా ఏప్రిల్ నెలలోకి రిలీజ్ కి వాయిదా పడిపోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు