డైరెక్టర్ శంకర్ , ఈ పేరు తెలుగు ఆడియన్స్ కు కొత్తది కాదు.
ప్రతి సినిమాలోను సామజిక అంశాలు స్పృహించేలా ఉంటుంది ఆయన పనితనం. కానీ ఇప్పుడు శంకర్ తీయబోయే సినిమాల మీదే ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది. రన్వీర్ సింగ్తో అపరిచితుడు ఇస్స్యూ , మరో వైపు ఇండియన్ 2 సినిమా వివాదం ఇవన్నీ జరుగుతున్న తరుణంలోనే , శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయ్. శంకర్ తన కెరీర్లో మొదటి సారిగా తెలుగు హీరోతో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
చిరుత సినిమాతో ఇండస్ట్రీ హీరో గా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్,మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు వచ్చినా, చరణ్ కి మాత్రం తగినంత పేరు రాలేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో చరణ్ కి ఎనలేని గౌరవం వచ్చింది. ఆ తరువాత ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే చరణ్ సినిమాను చేస్తున్నారు శంకర్.
ఈ క్రమంలో చరణ్ కోసం ఆ షూటింగ్ కి హాజరైన ఎన్టీఆర్ కి కూడా శంకర్ ఒక లైన్ వినిపించారని, ఆ లైన్ తారక్ కి నచ్చడంతో శంకర్ తారక్ తో కూడా సినిమా చేస్తాడని, ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుందని అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవాలు తెలియాలంటే అధికారక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. మరో వైపు ఎన్టీఆర్, కొరటాల శివ, బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ సినిమాలను లైన్ లో పెట్టాడు.