టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రియాలిటీ షో రోజు రోజుకు ఆసక్తి గా మారుతుంది. ఇప్పటికే 78 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌస్, చివరి దశలో ఉంది. దీంతో కంటెస్టెంట్స్, పోటా పోటీగా టాస్క్ లలో పాల్గొని, ప్రేక్షకుల మనసులు దోచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. ఈ వారం నామినేషన్ లో ఇంటి సభ్యులు అందరూ ఉండగా, ఒక్కొక్కరు సేఫ్ అవుతూ వచ్చారు. చివరికి బాబా భాస్కర్, అనిల్, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. బాబా భాస్కర్, ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకోవడంతో సేఫ్ జోన్ లోకి వెళ్లాడు. అనిల్, సేఫ్ అయినట్టు నాగార్జున అనౌన్స్ చేయడంతో, నటరాజ్ మాస్టర్ ఈ ఆదివారం ఎలిమినేట్ అయ్యాడు.
నిజంగా చెప్పాలంటే, నటరాజ్ మాస్టర్ స్ట్రాంగ్ ప్లేయర్. అలాంటి వ్యక్తి ఇప్పుడే ఎలిమినేట్ అవడం కొంతమందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ప్రతి విషయంలో అతిగా ఎమోషనల్ అవడం, సందర్భం లేకుండా కూడా తన పాప గురించి మాట్లాడటం బిగ్ బాస్ ప్రేక్షకులకు నచ్చలేదు కాబోలు. అందుకే ఆయనకు ప్రేక్షకులు ఎలిమినేట్ పాస్ ఇచ్చారు.
అయితే ఈ ఆదివారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడాన్ని పలువురు నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. హౌస్ లో ఉన్న మిత్రా, అనిల్ కు తక్కువ ఓట్లు వచ్చినా, నటరాజ్ మాస్టర్ ను ఎలిమినేట్ చేశారని మండిపడుతున్నారు.