Personality Development: ఈ అలవాట్లు ఉంటే అన్ సక్సెస్ ఫుల్

Personality Development:  అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా జీవితంలో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగాలని కోరుకుంటారు. అయితే రోజురోజుకు అనుకున్న విధంగా జీవితంలో ఎదుగుతున్న అబ్బాయిలకు, జీవితంలో స్టక్ అయిపోయే వారికి మధ్య చాలా తేడా ఉంటుంది. అయితే జీవితంలో ముందుకు సాగని అన్ సక్సెస్ ఫుల్ అబ్బాయిలకు కొన్ని అలవాట్లు ఉంటాయి. సైకాలజీ ద్వారా వాటిని బట్టి వారు ముందుకు వెళ్లడానికి ఇష్టపడకుండా, గతంలో ఎదురైన కొన్ని పరిస్థితుల వల్ల అక్కడే స్టక్ అయిపోయారని గుర్తించవచ్చు. ఒకవేళ మీకు కూడా అలాంటి ఫీలింగ్ కలిగితే మీలో ఈ కింద చెప్పబోయే లక్షణాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. మరి ఆ అలవాట్లు ఏంటి? అంటే…

1. గతంలో జీవించడం

Past
గతం అనేది మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. అయితే గతం నుంచి నేర్చుకోవడం వేరు, గతంలో చిక్కుకోవడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. లైఫ్ లో అన్ సక్సెస్ ఫుల్ గా మిగిలిపోయే అబ్బాయిలు ఎక్కువగా గతం గురించే ఆలోచిస్తూ ఉంటారు. గతంలో తమ జీవితంలో జరిగిన తప్పులు, ఫెయిల్యూర్స్, కోల్పోయిన అవకాశాలపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. దీంతో వాళ్లు ప్రజెంట్ ను కోల్పోతారు. ఎప్పుడూ గతం గురించే ఆలోచిస్తూ ప్రస్తుతం మన చేతిలో ఉన్న విలువైన క్షణాలను వాడుకుని ముందుకు సాగడంలో ఫెయిల్ అవుతారు. జీవితం అన్నాక హెచ్చుతగ్గులు సర్వసాధారణం. గత అనుభవాల నుంచి పాటలు నేర్చుకోవాలి. అంతేగాని వాటి గురించే ఆలోచిస్తూ ఇప్పుడున్న సమయాన్ని వేస్ట్ చేసుకోవడం అవివేకం. ఎందుకంటే టైం చాలా విలువైనది. ఒక్కసారి గడిచిపోతే దాన్ని ఎవ్వరూ వెనక్కు తీసుకురాలేరు.

- Advertisement -

2. రిస్క్ అంటే భయపడడం

Risk
ఇక వీళ్లకు ఉండే మరొక ముఖ్యమైన లక్షణం రిస్క్ చేయాలంటే భయం. వాళ్లు ఎప్పుడూ తమ కంఫర్ట్ జోన్ లలోనే ఉండడానికి ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు జీవితంలో విజయం సాధించాలి అనుకుంటే రిస్కు తీసుకోక తప్పదు. ఇక్కడ విస్క్ అంటే నిర్లక్ష్యంగా నిర్ణయాలు తీసేసుకోవడం కాదు. లాభనష్టాలను అంచనా వేసి, కంఫర్ట్ జోన్ నుంచి బయట పడి, కొత్త విషయాలను ప్రయత్నించడం, దాని నుండి వచ్చే ఫలితాల నుంచి నేర్చుకోవడం.

3. వాయిదా వేయడం

post
మనలో చాలామంది ఎన్నో పనులను వాయిదా వేస్తూ ఉంటాం. ఏముందిలే రేపు చేసుకోవచ్చు అని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంటాం. అన్ సక్సెస్ ఫుల్ పీపుల్ కు ఉండే మరొక ప్రధాన లక్షణం ఇదే. ఏదైనా పని చేయడానికి బదులు ఈరోజు రేపు అంటూ ముహూర్తం చూసుకుంటూ ఉంటారు. కానీ నిజం ఏంటంటే దేనికి కచ్చితంగా ఇదే కరెక్ట్ టైం అనేది ఎప్పటికీ ఉండదు. అది కేవలం నమ్మకం మాత్రమే. మనం ఒక పనిని వాయిదా వేసాము అంటే ఆ టైంలో వేస్ట్ చేసామని అర్థం. దానివల్ల ఒక అవకాశం చేజారిపోతుంది, అలాగే లైఫ్ లో డెవలప్మెంట్ అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. సక్సెస్ ఫుల్ పీపుల్ ఎప్పుడు టైంకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ, దాని విలువను అర్థం చేసుకుని అనుకున్న సమయానికి పనులను పూర్తి చేసుకుంటారు. అన్ సక్సెస్ఫుల్ పీపుల్ పనులు మాటల్లోనే ఉంటాయి. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ చెప్పడం కాదు చేసి చూపిస్తారు.

4. నమ్మకం లేకపోవడం

Beliefe
అన్ సక్సెస్ఫుల్ పీపుల్ లో కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. తమ సామర్థ్యం పట్ల సందేహపడుతూ ఆత్మవిశ్వాసం లేకపోవడంతో తమను తక్కువ అంచనా వేసుకుంటూ అనుకున్నది సాధించలేక పోతారు. ఏదైనా ఒక పని చేయాలంటే దానికి తాము తగిన వాళ్ళం కాదని, ఆ పని చేయలేం అని ముందుగానే ఫిక్స్ అయిపోతారు. దానికి ముఖ్య కారణం ఆ పని తాము చేయగలం అని నమ్మకం లేకపోవడం. కానీ మనిషి తలుచుకుంటే చేయలేనిది అంటూ ఏదీ లేదు. సక్సెస్ ఫుల్ పీపుల్ తమ సామర్థ్యాన్ని, విలువలను గట్టిగా నమ్ముతారు. అయితే మిమ్మల్ని మీరు నమ్మితే లైఫ్ లో ఎలాంటి చాలెంజెస్ ను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, తప్పులు చేయరని అర్థం కాదు. మీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకినీ అధిగమించి, నేర్చుకుంటూ ముందుకు సాగే కాన్ఫిడెన్స్ తో ఉంటారని అర్థం.

5.

blame

ఇక తాము చేసిన తప్పులను అంగీకరించి వాటి నుంచి నేర్చుకునే బదులు సాకులు వెతుక్కుంటూ బ్లేమ్ గేమ్ ఆడతారు. అలాగే ఆశయాల పేరుతో వ్యక్తిగత సంబంధాలను నిర్లక్ష్యం చేస్తారు. అలాగే తమకున్న జ్ఞానం చాలని, కొత్త స్కిల్స్ ను నేర్చుకోవడం అవసరం లేదు అని మూర్ఖపు ఆలోచనలో ఉంటారు. స్పష్టమైన ఖచ్చితమైన గమ్యం లేకుండా పరధ్యానంలో పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లు జీవితంలో ఎప్పటికీ సక్సెస్ కాలేరు. మరి మీలో కూడా ఇలాంటి అనవసరమైన అలవాట్లు ఉన్నాయా? అని ఒకసారి చెక్ చేసుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు