Dyssomnia: నిద్ర పట్టట్లేదా? ఈ స్లీపింగ్ డిజార్డర్ ఉందేమో ఇలా చెక్ చేసుకోండి

చాలామంది ఒత్తిడి లేదంటే ఇతర కారణాల వల్ల నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. అయితే స్లీపింగ్ డిజార్డర్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. అందులో డిస్సోమ్నియా ఒకటి. కొన్ని రకాల స్లీపింగ్ డిజార్డర్స్ కలిగి ఉంటే డిస్సోమ్నియా అంటారు. దీనిని స్లీప్ వేక్ డిజార్డర్ అని కూడా పిలుస్తారు. మరి డిస్సోమ్నియా లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ డిస్సోమ్నియా ఉంటే మీకు ఉన్న స్లీపింగ్ డిజార్డర్ ని బట్టి లక్షణాలు మారవచ్చు. డిస్సోమ్నియాలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఏంటంటే…

1. నిద్ర పోవాలని అనుకున్నప్పటికీ నిద్ర పట్టకపోవడం
2. రాత్రి సమయాల్లో నిద్రపోవడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టడం
3. ఉదయం లేవడానికి ఇబ్బంది పడడం
4. రోజూ రాత్రిపూట ఎక్కువసార్లు మెలకువ రావడం, మళ్లీ సరిగ్గా నిద్ర పట్టకపోవడం
5. తెల్లవారుజామున చాలా త్వరగా మెలకువ రావడం, తిరిగి నిద్ర పట్టకపోవడం
6. నిద్రలేచినప్పుడు మీరు అస్సలు నిద్రపోనట్టు, బాగా అలసిపోయినట్టుగా అనిపించడం
7. పగటిపూట విపరీతంగా నిద్ర రావడం
8. పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం
9. సమయం సందర్భం లేకుండా నిద్రపోవడం అంటే కొన్నిసార్లు భోజనం చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా నిద్రపోవడం
10 నిద్రపోతున్నప్పుడు బిగ్గరగా గురక పెట్టడం, పెద్దగా ఊపిరి పీల్చుకోవడం, లేదా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు శబ్దాలు చేయడం
11. నిద్రపోతున్నప్పుడు కొద్దిసేపు శ్వాసను ఆపివేయడం
12. నిద్ర పోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో మీ బాడీ పార్ట్స్ లో ఆ సౌకర్యం కలగడం, నొప్పి లేదా గగుర్పాటు ఫీలింగ్ కలగడం
13. నిద్రలో మీ చేతులు లేదా కాళ్ళను ఎక్కువగా కదుపుతూ ఉండడం
14. అర్ధరాత్రి పూట ఆకలేసి నిద్రలేవడం
15. ఒత్తిడి, నిస్సృహ, చిరాకు, ఆత్రుత, అసహనం వంటి ఫీలింగ్స్ రావడం
16. తలనొప్పి, జ్ఞాపకశక్తి సమస్యలు, కాన్సన్ట్రేట్ చేయడానికి ఇబ్బంది పడడం
17. సోషల్ అవేర్నెస్ కు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం
18. షిఫ్టులలో పని చేయడం వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడం
ఇలాంటి లక్షణాలు డిస్సోమ్నియా ఉండే వారిలో కనిపిస్తాయి. ఒకవేళ ఇందులో ఎక్కువ లక్షణాలు మీలో గనక ఉన్నట్లయితే స్లీప్ స్పెషలిస్ట్ ల దగ్గరకు వెళ్లడం మంచిది. వాళ్లు మీ సమస్యలు, లక్షణాలు, మీ ఫ్యామిలీ హిస్టరీ, శారీరక పరీక్షలు , పాలీసోమ్నోగ్రామ్ టెస్ట్ వంటివి చేసి ఇది అసలు డిస్సోమ్నియానా కాదా అనే విషయాన్ని నిర్ధారిస్తారు.

ఒకవేళ మీరు ఇబ్బంది పడుతుంది డిస్సోమ్నియా కారణంగా అయితే దాన్ని తగ్గించడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఇస్తారు. అలాగే బ్రైట్ లైట్ థెరపీ, ఒత్తిడిని తగ్గించుకోవడానికి రిలాక్సేషన్ వ్యాయామాలు, మంచి ఆహారం, మందులు సూచిస్తారు.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు