Bigg Boss Telugu : హౌస్ నుంచి బయటకు వెళ్ళగానే బయటపడ్డ షకీలా నిజ స్వరూపం

Bigg Boss Telugu

బిగ్ బాస్ సీజన్ సెవెన్ రెండోవారం ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ గా హౌస్ లో నుంచి బయటకు వెళ్ళిపోయింది నటి షకీలా. బిగ్ బాస్ హౌస్ లో షకీలా అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి కంటెస్టెంట్స్ అందరితో కలివిడిగా ఉంటూ.. హౌస్ లో పాజిటివిటీ ను స్ప్రెడ్ చేసిన షకీలా నిన్న ఎలిమినేట్ అయిన వెంటనే మాట మార్చిందని చెప్పవచ్చు.

నిజానికి ఈ వారం జరిగిన షకీలా ఎలిమినేషన్ ను ఎవరు ఊహించలేదని చెప్పవచ్చు. ఎందుకంటే షకీలా గేమ్ పరంగా తన ఆట బాగానే ఆడింది. అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య గొడవలు వస్తుంటే కూడా వాటన్నింటికి సర్ది చెప్పి అందరితో చేత నోరారా అమ్మ అని పిలిపించుకుంది షకీలా.

ఆమె నిన్న హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయ్యాక కూడా కంటెస్టెంట్ కు వార్నింగ్ ఇవ్వడానికి గాను నాగార్జున పెట్టిన టాస్కులో కూడా హౌస్ మేట్స్ పై పాజిటివ్ గానే రియాక్ట్ అయింది షకీలా. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న షకీలా బిగ్ బాస్ బజ్ లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక్కసారిగా టోన్ మార్చి కంటెస్టెంట్స్ పై విమర్శలు చేసింది.

- Advertisement -

బిగ్ బాస్ బజ్ లో భాగంగా ఆమెను యాంకర్ పలు ప్రశ్నలు అడగగా కంటెస్టెంట్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది షకీలా. ముఖ్యంగా తన ఎలిమినేషన్ కు కారణమైన యావర్ పై షకీలా ఘాటుగా స్పందించింది. అలాగే రతిక ను బ్యూటిఫుల్ స్నేక్ అంటూ అభివర్ణించింది. ఇక పల్లవి ప్రశాంత్ పై కూడా షకీలా నెగిటివ్ గానే రియాక్ట్ అయింది. పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్ తనకేం నచ్చలేదంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఆట సందీప్, హీరో శివాజీ గురించి మాత్రం ఆమె పాజిటివ్ గా రియాక్ట్ అయింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు