Benifits of Quitting Alcohol: మందు మానేస్తే కలిగే లాభాలేంటో తెలుసా..?

ఈ రోజుల్లో మద్యపానం సర్వ సాధారణం అయిపోయింది. చిన్న-పెద్ద, ఆడ-మగ, అన్న తేడా లేకుండా అందరిలో ఈ అలవాటు పెరిగిపోతోంది. మొదట సరదాగా మొదలయ్యి, ఆ తర్వాత అలవాటుగా మారి, వ్యసనంగా తయారవుతుంది. మద్యపానం వల్ల అనారోగ్యం కొని తెచ్చుకోవటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కూడా తలెత్తుతుంది. మద్యానికి అలవాటు పడటం ఎంత సులభమో, ఆ వ్యసనం నుండి బయటపడటం అంత కష్టం. కష్టమైనప్పటికీ తాగడం మానేస్తే చాలా లాభాలు పొందొచ్చు.

మద్యపానం ఆపేసిన ఒకరోజు తర్వాత ఏమవుతుంది..?

ఆల్కహాల్ తీసుకోవటం ఆపేసిన మొదటి రోజు కాస్త ఇబ్బందిగానే ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు.  తలనొప్పి, చెమటలు పట్టడం, అలసట, ఆందోళన, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పటికీ 24గంటల తర్వాత నుండి  రికవర్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. హైడ్రేషన్ ఇంప్రూవ్ అవ్వటం, బ్లడ్ లో ఆల్కహాల్ లెవెల్స్ తగ్గటం వంటి బెనిఫిట్స్ స్టార్ట్ అవుతాయి. ఎలాంటి మెడికేషన్ లేకుండా ఆల్కహాల్ అడిక్షన్ నుండి బయటపడటంలో ఇది ఇంపార్టెంట్ ఫేజ్ అని డాక్టర్స్ చెప్తున్నారు.

మూడు రోజుల తర్వాత:

ఆల్కహాల్ తీసుకోవటం ఆపేసిన మూడు రోజుల తర్వాత విత్ డ్రాల్ సింప్టమ్స్ కనిపించటం సహజ లక్షణమే అని నిపుణులు చెప్తున్నారు. నిద్రలేమి, డిప్రెషన్ వంటి లక్షణాలు కామన్ గా ఉంటాయి, ఈ స్టేజ్ లో ఫిజికల్ గా వీక్ అవుతారు. ఈ స్టేజ్ లో టెంప్టేషన్ కూడా ఎక్కువ ఉన్నప్పటికీ నిగ్రహంగా ఉన్నట్లయితే, తర్వాత ఎనర్జీ లెవెల్స్ పెరగటం, హెల్తీ స్లీప్, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వటం వంటి లక్షణాలు మూడు రోజుల తర్వాత కనిపిస్తాయి. అంతే కాకుండా స్కిన్ లో గ్లో పెరగటం, ముఖ్యంగా లివర్ హెల్త్ కూడా మెరుగవ్వటం స్టార్ట్ అవుతుంది.

రెండు వారాల తర్వాత:

రెండు వారాలు గడిచాక డిఫరెన్స్ క్లియర్ తెలుస్తుంది.ఇమ్యూన్ సిస్టం ఇంప్రూవ్ అవ్వటం కూడా స్పష్టంగా తెలుస్తుంది. స్కిన్ లో గ్లో పెరగటం, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వటం, స్లీప్ క్వాలిటీ పెరగటం వంటి బెనిఫిట్స్ క్లియర్ గా తెలుస్తాయి. ఈ స్టేజ్ లో విత్ డ్రాల్ సింప్టమ్స్ కూడా తగ్గుముఖం పట్టి రికవరీ స్పీడ్ పెరుగుతుంది.

ఒక నెల తర్వాత:

నెల రోజుల తర్వాత లివర్ పూర్తిగా రికవర్ స్టేజ్ కి చేరటమే కాకుండా సిరాసిస్, హార్ట్ డిసీజెస్ వచ్చే ప్రమాదం నుండి బయటపడుతుంది. కార్డియో వస్కులార్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యి వెయిట్ లాస్ మొదలై ఫిజిక్ లో చేంజెస్ కూడా స్పష్టంగా కనిపిస్తాయి.

మూడు నెలల తర్వాత:

ఆల్కహాల్ మానేసిన మూడు నెలల తర్వాత ప్రపంచాన్ని ఒక కొత్త లెన్స్ లో చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ స్టేజ్ లో స్లీప్ సైకిల్ గాడిలో పడుతుంది. మునుపటికంటే త్వరగా నిద్రపోవటాన్ని మీరు గమనిస్తారు. పాజిటివ్ థింకింగ్ పెరిగి, క్రియేటివ్ గా, మోటివేటెడ్ ఉండటం స్టార్ట్ చేస్తారు. ఆల్కహాల్ అడిక్షన్ వల్ల జరిగిన బ్రెయిన్ డ్యామేజ్ కూడా రికవర్ అవ్వటం కూడా స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్ లో.

ఆరు నెలల నుండి సంవత్సరం తర్వాత:

ఈ స్టేజ్ లో మిమ్మల్ని మీరు అన్ని అంశాల్లో కొత్తగా ఆవిష్కరించటం స్టార్ట్ చేస్తారు. డిప్రెషన్, ఆందోళన మొదలుకొని సెక్సువల్ హెల్త్ వరకు అన్నిటిలో ఇంప్రూవ్ మెంట్ క్లియర్ గా తెలుస్తుంది. ఈ స్టేజ్ లో బాడీ పార్ట్స్ అన్నీ రిపేర్ అవ్వటం స్టార్ట్ అయ్యి క్యాన్సర్, లివర్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ వంటివి వచ్చే ప్రమాదం నుండి బయటపడతారు. శరీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఇంప్రూవ్ మెంట్ వచ్చి పర్సనల్ లైఫ్ కూడా మెరుగుపడుతుంది.
ఇలాగే శాశ్వతంగా ఆల్కహాల్ కి దూరంగా ఉండటం వల్ల అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. సెట్ చేసుకున్న గోల్స్ ని అనుకున్న సమయానికి సమర్థవంతంగా ఫుల్ ఫిల్ చేసుకునే స్థాయికి చేరుకోవచ్చు.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు