Virata Parvam: విషాద పర్వం

దగ్గుపాటి రానా , సాయి పల్లవి హీరోహీయిన్లుగా నటించిన చిత్రం విరాటపర్వం. నీది నాది ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎప్పుడో మొదలైన ఈ సినిమా కోవిడ్ వలన వాయిదా పడుతూ జూన్ 17న థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమాకు సోషల్ మీడియాలో ప్రశంసలు వచ్చాయి కానీ కలక్షన్స్ మాత్రం రాలేదు.
ఎంతో నమ్మకంతో థియేటర్స్ లో రిలీజ్ చేసిన విరాటపర్వానికి ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి.

ముందుగా విరాటపర్వానికి భారీ స్థాయిలో ఓటిటి ఆఫర్స్ వచ్చాయి.
ఈ డీల్ కి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా మద్దతు తెలిపి ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ టీం వాటిని లెక్క చేయకుండా కేవలం థియేటర్ లోనే రిలీజ్ చేయాలనీ పట్టుపట్టుకుని కూర్చుండటంతో ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఒక యదార్ధ గాథను నిజాయితీగా తెరకెక్కించడంలో వేణు సక్సెస్ అయ్యాడు.
సినిమా చూస్తున్నంతసేపు మనలో విప్లవాత్మకమైన భావం కూడా కలుగుతుంది. కానీ ఇవి ఏవి సినిమాను కమర్షియల్ సక్సెస్ చెయ్యలేకపోయాయి.

ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన అతి తక్కువ రోజుల్లోనే మళ్ళీ ఓటిటిలో దర్శనమివ్వాల్సిన పరిస్థితి. కేవలం ఈ సినిమాకి థియేటర్ లో సరైన ఆదరణ లేకపోవడమే దీనికి కారణం చాలామంది అభిప్రాయం. విరాటపర్వం సినిమా జులై 1 నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో రానుంది. ఒక రకంగా విరాటపర్వానికి ఇదొక విషాద పర్వంలా అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు