Tiger Nageswara Rao OTT : ఓటీటీలో హిస్టరీ క్రియేట్ చేయబోతున్న టైగర్ నాగేశ్వరరావు… ఇది ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే ఫస్ట్ టైం

Tiger Nageswara Rao OTT : మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ థియేటర్లలో రికార్డులైతే క్రియేట్ చేయలేక పోయింది. కానీ ఓటిటిలో మాత్రం సరికొత్త హిస్టరీని క్రియేట్ చేస్తోంది. ఇండియన్ ఫిలిం చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక కొత్త లాంగ్వేజ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్లలో ఊహించని రెస్పాన్స్

రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ మూవీలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించగా, రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించారు. స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా దసరా కానుకగా రిలీజ్ అయింది. అయితే థియేటర్లలో ఈ మూవీకి డిజాస్టర్ రెస్పాన్స్ రాగా, తర్వాత కొన్ని రోజులకే సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. అయితే విశేషం ఏమిటంటే… ఈ మూవీ ఇప్పటిదాకా ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే రిలీజ్ కానీ ఓ డిఫరెంట్ లాంగ్వేజ్ లో ఓటిటిలోకి వచ్చేసింది.

Tiger Nageswara Rao trailer: Ravi Teja stars as 'India's biggest thief'. Watch - Hindustan Times

- Advertisement -

సైన్ లాంగ్వేజ్ లో టైగర్ నాగేశ్వరరావు…

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న టైగర్ నాగేశ్వరరావు మూవీని తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా చూడొచ్చు. ఇక వీటితో పాటే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది. అంటే మూగ, చెవిటి వారి కోసం ఈ స్పెషల్ గా ఈ సైన్ లాంగ్వేజ్ లో మూవీని రిలీజ్ చేసి కొత్త చరిత్రను సృష్టించారు టైగర్ నాగేశ్వరరావు మూవీ టీం. ఇండియన్ సినిమాలో ఇదొక కొత్త చాప్టర్ అని చెప్పొచ్చు. ఇకనుంచి రిలీజ్ అయ్యే సినిమాలు టైగర్ నాగేశ్వరరావును స్ఫూర్తిగా తీసుకొని మూగ, చెవిటి వారి కోసం ఈ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తే వాళ్లకు కూడా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది.

టైగర్ నాగేశ్వరరావు స్టోరీ…

1970-80 లలో ప్రజలతో పాటు పోలీసులకు కూడా స్టువర్టుపురం నాగేశ్వరరావు పేరును తలిస్తే చాలు ఓ రకమైన భయం ఉండేది. టైగర్ నాగేశ్వరరావు కన్ను పడిందంటే చాలు అది ఎంతటి విలువైన వస్తువు అయినా, ఎంతటి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నా చెప్పి మరీ దొంగతనాలు చేస్తాడని, దోపిడీకి ఆయన పెట్టింది పేరని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికీ ఆయన గురించి కథలుగా చెప్పుకునేంత పేరు మోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు. ఇదే స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. 1980లో ఆంధ్రప్రదేశ్లోని స్టువర్టుపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గురించి ఏకంగా ఢిల్లీలో ప్రధానమంత్రి భద్రతను దగ్గరుండి సమీక్షించే ఇంటలిజెన్స్ అధికారి రాజ్ ఉత్ తెలుసుకోవాలి అనుకుంటారు. అందుకోసం ఆయన స్టువర్టుపురం గురించి బాగా తెలిసిన పోలీస్ ఆఫీసర్ విశ్వనాథ శాస్రిని పిలిపించి నాగేశ్వరావు గురించి ఆరా తీయడం స్టార్ట్ చేస్తాడు. దానికి అసలు కారణం ఏంటి? చెప్పి మరీ దోపిడీలకు పాల్పడుతున్న నాగేశ్వరరావు అసలు టార్గెట్ ఏంటి? అనేదే ఈ మూవీ స్టోరీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు