OTT : ఈ వారం సందడే సందడి

సినిమాలను థియేటర్ లలో కంటే ఓటీటీలోనే చూడటానికి ఎక్కువ మంది ఇష్టపడతున్నారు. ఇది కరోనా వైరస్ వ్యాప్తి వల్ల వచ్చిన లాక్ డౌన్ నుంచి ప్రారంభం అయింది. దీంతో ప్రతి వారం ఓటీటీలో వచ్చే సినిమాల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. కాగా ఈ వారం ఓటీటీలో ఆసక్తికరమైనర సినిమాలు వస్తున్నాయి. గత నెలలో విడుదలైన సినిమాలు, ఈ వారం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చుద్దం.

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రితేష్ రానా దర్శకత్వం వహించిన సినిమా హ్యాపీ బర్డ్ డే. ఈ సినిమా జూలై 8న విడుదల అయింది. ఆగస్టు 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది. అలాగే రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా ది వారియర్. ఈ సినిమా జూలై 14న విడుదలైంది. ఇది ఆగస్టు 11 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా జంటగా నటించిన సినిమా థాంక్యూ. ఇది జూలై 22న థియేటర్ లలో విడుదల కాగా, ఆగస్టు 12 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.

అలాగే సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గార్గి. ఇది జూలై 15న విడుదలైంది. 12 ఆగస్టున సోనీ లివ్ లోకి రానుంది. విజయ్ సేతుపతి నటించిన మహా మనిషి, ఫహద్ ఫజిల్ నటించిన మాలిక్ సినిమాలను ఆహా తెలుగులోకి డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా ఆగస్టు 12 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు