అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రస్తుతం పెద్ద సినిమాలను రెంటల్ పద్దతిలోనే సినిమాలను స్ట్రీమింగ్ చేస్తుంది. కేజీఎఫ్ చాప్టర్ 2, సర్కారు వారి పాట సినిమాలు థియేటర్లో ఉండగానే అమెజాన్ ప్రైమ్ వీడియో లో రెంటల్ పద్ధతి లో రిలీజ్ అయ్యాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా నెల రోజుల తర్వాత ప్రైమ్ లోకి వచ్చింది. కానీ సర్కారు వారి పాట చిత్రాన్ని 3 వారాలకే పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ అయ్యింది. అయితే, ఇలా రెంటల్ పద్ధతిలో ఓటిటిలో రిలీజ్ అవ్వడం వల్ల థియేట్రికల్ బిజినెస్ కు దెబ్బ పడుతుంది అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా డబ్బులు పెట్టి ఎందుకు సినిమా చూడాలి అనే కామెంట్స్ ఓటీటీ లవర్స్ నుండి వస్తున్నాయి. ఇలా పే పర్ వ్యూ పద్ధతిలో ఓటీటీలోకి వచ్చిన అరగంటలోనే పైరసీ సైట్ ల్లోకి వస్తున్నాయి. దీని వల్ల ప్రైమ్ వీడియోకు వ్యూవర్ షిప్ దెబ్బతింటుంది.
అయితే, అమెజాన్ ప్రైమ్ రెంటల్ పద్దతిలో తీసుకువచ్చిన బాట్ మెన్, కే.జి.ఎఫ్ 2, సర్కారు వారి పాట చిత్రాలు లాభాలు తెచ్చిపెట్టాయి. పైరసీ సైట్ లలో సినిమా పెట్టడం అనేది ఎలాగూ ఉంటుంది. కొందరు పైరసీ సైట్ లో చూసినా, మరి కొందరు క్వాలిటీ కోసం అమెజాన్ లో చూస్తున్నారు. వ్యూయర్ షిప్ కూడా వస్తుంది. మరి థియేట్రికల్ బిజినెస్ దెబ్బతింటుంది కదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే, ఇది నిర్మాతలు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఏది ఏమైనా, రెంటల్ పద్దతిలో ఓటీటీ సంస్థలు కొంత వరకు లాభాలు చూడటంతో, అన్ని ఓటీటీలు ఇదే ఫార్ములాను అనుసరించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.