OTT : “సర్కారు వారి” క్యాష్ ప్లాన్

ఓటీటీ.. థియేటర్స్ కు వెళ్లలేని వారికి ఇంట్లోనే కూర్చుండి సినిమాలు చూసే ఓ అవకాశం. కరోనా మహమ్మారి నుండి ఓటీటీ ఎక్కువ ఉపయోగంలోకి వచ్చింది. ఒక ఓటీటీ ప్లాట్ ఫాంకు మొదట కొంత డబ్బుతో సబ్ స్క్రైబ్ చేసుకుంటే, ఏడాది పాటు ఆ ఓటీటీ లో విడుదల అయ్యే సినిమాలను, వెబ్ సిరీస్ లను ఉచితంగా చూసే అవకాశముంటుంది. ఇప్పటి వరకు ఈ పద్ధతే కొనసాగింది.

కానీ, ఇటీవల ఈ పద్ధతికి పెద్ద సినిమాలు బ్రేక్ లు వేస్తున్నాయి. థియేటర్స్ లో కోట్లు కొల్లగొట్టినా, ఓటీటీలో మళ్లీ ప్రేక్షకుల జేబుకు చిల్లు పెట్టడానికి రెడీ అవుతున్నాయి. ఓటీటీ సబ్ స్క్రైబర్లు కూడా సినిమాలు చూడాలంటే, మళ్లీ డబ్బులు కట్టాల్సిన పరిస్థితిని పెద్ద సినిమాలు తీసుకువచ్చాయి.

ఇది మొదట “ఆర్ఆర్ఆర్” సినిమాతో ప్రారంభమైంది. సినీ లవర్స్ నుండి వ్యతిరేకత రావడంతో “ట్రిపుల్ ఆర్” బృందం వెనక్కి తగ్గింది. కానీ, “కేజీఎఫ్ చాప్టర్ 2” మాత్రం వెనకడుగు వేయలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయిన “కేజీఎఫ్ చాప్టర్ 2”, డబ్బులు చెల్లించే పద్దతిలోనే ప్రసారమైంది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఉచితంగా చూసేందుకు వీలు కల్పించింది.

- Advertisement -

“కేజీఎఫ్ చాప్టర్ 2” బాటలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” నడుస్తుంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ మూవీ నేటి నుండే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఓటీటీలోకి వచ్చిందన్న సంతోషం ప్రేక్షకులకు ఎంతో సేపు లేదు. ఈ చిత్రాన్ని చూడాలంటే, డబ్బులు చెల్లించాలని “సర్కారు వారి పాట” బృందం ప్రకటించి బాంబు పేల్చింది.

నిజానికి మహేష్ బాబు సినిమాకు థియేటర్స్ లోనే మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికే 200 కోట్ల మార్క్ ను ఈ చిత్రం అందుకుంది. అది చాలదన్నట్టు, ఓటీటీని కూడా క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. దీంతో సినీ ప్రేమికులతో పాటు మహేష్ అభిమానులు కూడా “సర్కారు వారి” పై మండిపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు