OTT Movies This Week : ఈ వారం ఓటీటిలోకి రాబోతున్న 19 సినిమాలు… ఆ 4 మాత్రమే స్పెషల్

OTT Movies This Week : బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లవ్ మీ మూవీతో థియేటర్లు రీఓపెన్ అయ్యాయి. ఇక ఈవారం థియేటర్లలోకి మూడు క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరి, కార్తీక్ గుమ్మకొండ భజే వాయువేగం, ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమాలు థియేటర్లలో ఈవారం సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇక థియేటర్ లతో పాటు ఓటీటీల్లోకి కూడా మే 27 నుంచి జూన్ 2 వరకు ఓటిటిలో హడావుడి చేయడానికి సినిమాలు, వెబ్ సిరీస్ లు సిద్ధంగా ఉన్నాయి.

అయితే ఈ వారం ఓటీటీలోకి ఏకంగా సినిమాలు, సిరీస్ లతో కలిపి 19 స్ట్రీమింగ్ కాబోతున్నాయి. కానీ వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగు సినిమాలు లేవు. మొత్తం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఈ వారం తెలుగు ప్రేక్షకులు ఓటిటిలో చూడడానికి ఏమీ లేదా అని నిరాశ పడిపోకండి. ఎందుకంటే ఓ రెండు వెబ్ సిరీస్ లు, 2 ఇంట్రెస్టింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా చూడొచ్చు. పాపులర్ సిరీస్ పంచాయతీ సీజన్ 3, ఇల్లీగల్ సీజన్ 3 తో పాటు హారర్ మూవీ ది ఫస్ట్ ఒమెన్, స్వాతంత్ర్య వీర్ సావర్కర్ స్పెషల్ గా ఉండబోతున్నాయి.

Panchayat Season 3 release date announced! Here is when you can watch  Jitendra Kumar starrer series - The Statesman

- Advertisement -

పంచాయత్ 3

‘పంచాయత్ ‘ అనేది ఓటీటీ పాపులర్ సిరీస్‌లలో ఒకటి. మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ కాగా, మేకర్స్ త్వరలో మూడవ భాగాన్ని తీసుకురాబోతున్నారు. జీతేంద్ర కుమార్ అద్భుతమైన నటనతో తెరకెక్కిన ఈ షో మే 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ను చూడవచ్చు.

స్వాతంత్ర్య వీర్ సావర్కర్

రణదీప్ హుడా దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ని థియేటర్‌లలో మిస్ అయ్యి ఉంటే, ఈ వారం దాన్ని ఓటీటీలో చూడవచ్చు. ఈ చిత్రం మే 28న జీ5లో ప్రసారం కానుంది.

The First Omen - Movie

ది ఫస్ట్ ఒమెన్

పారానార్మల్ యాక్టివిటీతో సాగే ఈ చిత్రం హారర్ మూవీ ప్రేమికులకు మంచి కంటెంట్ అని చెప్పవచ్చు. ‘ది ఫస్ట్ ఒమెన్’ అనేది ఒక ప్రీక్వెల్ చిత్రం. చెడుతో పోరాడే స్త్రీ స్టోరీతో సాగుతుంది ఈ మూవీ. ఈ చిత్రం మే 30న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

పస్ ఇన్ బూట్స్ : ది లాస్ట్ విష్

పస్ ఇన్ బూట్స్ : ది లాస్ట్ విష్ ఒక అమెరికన్ యానిమేటెడ్ అడ్వెంచర్ కామెడీ చిత్రం. ష్రెక్ ఫిల్మ్ సిరీస్  ఆరవ భాగం ‘పస్ ఇన్ బూట్స్: ది లాస్ట్ విష్’ ఈ శనివారం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇల్లీగల్ 3

జియో సినిమా ఓటీటీలో ఇల్లీగల్ సీజన్ 3 స్ట్రీమింగ్ కానుంది. మే 29 నుంచి ఈ పాపులర్ సిరీస్ ప్రసారం మొదలవుతుంది. అయితే ఫ్రైడే వరకు ఇంకేమైనా తెలుగు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుత్తయేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు