Sai Dharam Tej: సినిమాల పరంగా కూడా కోలుకుంటాడా?

2021 వ సంవత్సరం సెప్టెంబర్ 10 ని సాయి తేజ్ ఎప్పటికీ మరిచిపోలేడు. అతను మాత్రమే కాదు అతని అభిమానులు కూడా మర్చిపోలేరు. వినాయక చవితి రోజు నాడు అతను బైక్ యాక్సిడెంట్ కు గురవ్వడం.. చాలా రోజులు బెడ్ పైనే ఉండటం.. మాములు రచ్చ కాదు అది. అయితే దేవుడి దయ వల్ల అతను త్వరగానే కోలుకున్నాడు. సినిమాల పరంగా కూడా మంచి లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు. ‘చిత్రలహరి’ ‘ప్రతీరోజూ పండగే’ ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న సాయి తేజ్ కు ‘రిపబ్లిక్’ షాకిచ్చింది.

దీంతో ఇప్పుడు స్క్రిప్ట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముందుగా పవన్ కళ్యాణ్ తో ‘వినోదయ సీతం’ రీమేక్ లో నటించనున్నాడు. నిజానికి ఒరిజినల్ లో సాయి.. లాంటి యంగ్ కుర్రాడి పాత్రకి స్కోప్ ఉండదు. మరి తెలుగులో ఎలా డిజైన్ చేశారు అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. సాయి తేజ్ పక్కన కేతిక శర్మ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. సముద్ర ఖని దర్శకుడు. ఈ చిత్రంతో పాటు సంపత్ నంది దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత మెగా హీరో ని డైరెక్ట్ చేయనున్నాడు సంపత్. చిరుకి పెద్ద ఫ్యాన్. కాబట్టి మెగా హీరోతో సినిమా అంటే అతను చాలా మనసు పెట్టి చేస్తాడు. కాబట్టి ఇది కూడా మినిమమ్ గ్యారంటీ ప్రాజెక్టు. ఈ సినిమాలు తేజ్ కెరీర్ కు బూస్టప్ ఇస్తాయని అంతా భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు