నేచురల్ బ్యూటీ సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అన్నట్టు దూసుకుపోతుంది. ఈ ట్యాగ్ ను సుకుమార్ ఈమెకు కరెక్ట్ గా పెట్టాడేమో అనిపిస్తుంది. ఈ 4 ఏళ్ళలో సాయి పల్లవి 4 పెద్ద సినిమాలను వదిలేసుకుంది. వాటిలో ఒక్కో సినిమాకి ఒక్కో కోటి చొప్పున ఆఫర్ చేశారు దర్శకనిర్మాతలు. అంటే రూ.4 కోట్లు ఆమె వద్దనుకున్నట్టే ! ఇక కమర్షియల్ యాడ్స్ లలో కూడా ఆమె నటించడానికి సిద్ధంగా లేదు. వాటి రూపంలో కూడా ఈమె కోటి రూపాయలు వదులుకున్నట్టే ! సాయి పల్లవి తన మనసుకి నచ్చిన సినిమాలే చేస్తూ ఉంటుంది. లవ్ స్టొరీ, శ్యామ్ సింగ రాయ్ వంటి చిత్రాల్లో ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు అంతా ఇంత కాదు.
ఈ లేడీ పవన్ కళ్యాన్ తాజా గా నటించిన విరాట పర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, సోల్ ఆఫ్ వెన్నెల వీడియోల ద్వారా సాయి పల్లవి ఎంత అద్భుతంగా నటించిందో తెలుసిపోతుంది. పైగా మెకప్ లేకుండానే ఈ సినిమాలో నటించానని ప్రకటించి, ప్రేక్షకులను ఆకర్షించింది. అయితే తాజా గా విరాప పర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవి గురించి ముఖ్య అతిథి విక్టరీ వెంకటేష్ చెప్పిన మాటలు ప్రస్తుం సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి నటించిన వెన్నెల పాత్రకు నేషనల్ అవార్డ్ వస్తుందని చెప్పుకొచ్చారు వెంకీ. సినిమా చూశాకే వెంకటేష్ ఇంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారని నెటిజన్లు అంటున్నారు. నిజానికి సాయి పల్లవి నటనకు నేషనల్ అవార్డు వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ లేడీ పవర్ స్టార్ కనుక నేషనల్ అవార్డ్ కొడితే, టాలీవుడ్ రేంజ్ మరోసారి పెరగడం ఖాయం.