Dil Raju : ఈసారైనా హిట్ ఇస్తాడా ?

నాగ చైతన్య హీరోగా లాంచ్ అయ్యింది దిల్ రాజు బ్యానర్ లో అన్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. 2009 లో ‘జోష్’ చిత్రంతో నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయానికి దిల్ రాజు ప్రొడ్యూసర్ గా సక్సెస్ లో ఉన్నాడు. దీంతో నాగ చైతన్య ఎంట్రీ బాధ్యతలను దిల్ రాజ్ కు నాగార్జున అప్పగించాడు. కానీ, ఫలితం తేడా కొట్టింది. తర్వాత కిందా మీదా పడి చైతన్య హీరోగా నిలబడ్డాడు. కానీ, ఏ స్టార్ హీరో కొడుకు అయినా మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించాలి. అలా జరిగితినే, తర్వాత వచ్చే సినిమాల పై నమ్మకం ఏర్పడుతుంది. చైతన్య ఎంట్రీ విషయంలో మాత్రం ఇది మిస్ అయ్యింది.

అంతేకాదు ‘చైతన్యకు మంచి లాంచింగ్ ఇవ్వలేకపోయాను’ అని దిల్ రాజు ఫీల్ అయినట్టు కూడా చాలా సందర్భాల్లో తెలిపాడు. ఇదిలా ఉండగా, వీరి కాంబినేషన్లో 13 ఏళ్ళ తర్వాత ‘థాంక్యూ’ మూవీ రాబోతుంది. ఈ సినిమాతో అయినా చైతన్యకు దిల్ రాజు హిట్ ఇస్తాడా అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ‘థాంక్యూ’ పై సరైన బజ్ లేకపోవడం అని చెప్పాలి.

‘థాంక్యూ’ ప్రమోషన్లలో భాగంగా విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ బాగున్నాయి. విక్రమ్ కుమార్ దర్శకుడు కాబట్టి, సినిమా కూడా బాగుంటుంది అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. కానీ, ఇది క్లాస్ మూవీ అని తెలిసిపోతుంది. ఇదే పెద్ద మైనస్ గా మారనుంది. ఈ మధ్య కాలంలో క్లాస్ సినిమాలు చూడడానికి జనాలు థియేటర్ కు రావడం లేదు. ‘అంటే సుందరానికీ!’ సినిమాకు ఎంత మంచి పాజిటివ్ టాక్ వచ్చినా, జనాలు థియేటర్ కి వెళ్ళలేదు. దానికి తోడు, వర్షాకాలం, కోవిడ్ ప్రభావం ‘థాంక్యూ’ బాక్సాఫీస్ రిజల్ట్ పై పడే అవకాశాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు