Mani Ratnam : థాంక్యూ అందుకేనా ?

టాలీవుడ్, కోలీవుడ్ ఎక్కడా చూసిన ఒక్కటే.. పొన్నియన్ సెల్వన్. అగ్ర దర్శకుడు మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ ఎన్నో సవాళ్ల తర్వాత ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. 1955 లో కల్కి కృష్ణ మూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను చేయాలని అప్పట్లో ఎంజీఆర్ కూడా కలలు కన్నారు. కానీ, అది అప్పట్లో సాధ్యం కాలేదు. కానీ, ప్రస్తుతం చియాన్ విక్రమ్, కార్తీ లాంటి స్టార్లతో మణిరత్నం రూపొందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం వచ్చే నెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఒక ఈవెంట్ ను కూడా నిర్వహించారు.

ఈవెంట్ లో దర్శకుడు మణిరత్నం కీలక వ్యాఖ్యలు చేశాడు. “నేను మెగాస్టార్ చిరంజీవికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. కానీ అది ఎందుకో అనేది మాత్రం ఇప్పుడే చెప్పను. త్వరలోనే మీ అందరికీ తెలుస్తుంది” అని స్టేజ్ పై మణిరత్నం చెప్పుకొచ్చారు. ఈ ఒక్క మాటతో టాలీవుడ్, కోలీవుడ్ లో అనేక రకమైన చర్చలు ముందుకు వస్తున్నాయి. అందులో ఒకటి.. పొన్నియన్ సెల్వన్ లో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో కనిపించబోతున్నాడట. అందుకే మణిరత్నం చిరంజీవి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

అలాగే మరో వార్త కూడా వస్తుంది. పొన్నియన్ సెల్వన్ తెలుగు వర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారట. సినిమాలో పలు కీలక సన్నివేశాల్లో మెగాస్టార్ ఇచ్చే వాయిస్ ఓవర్ హైలైట్ గా ఉంటుందని టాక్. అందుకే చిరంజీవికి మణిరత్నం థ్యాంక్యూ చెప్పారని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. మరీ ఇది నిజమో కాదో తెలియాలంటే, సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

నిజానికి మెగాస్టార్ చిరంజీవి గత కొంత కాలంగా కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో వస్తున్న “బ్రహ్మాస్త్రం” తో పాటే కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న “రంగ మార్తాండ” సినిమా కూడా చిరు తన గొంతును వినిపించాడు. ఈ రెండు సినిమాలు విడుదల కాకపోయినా, ఆయా సినిమాల మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేశారు. ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ కు కూడా చిరు వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు