సర్కారు వారి పాట టీమ్ ఓ పార్టీ చేసుకుంది. వాళ్ళు పార్టీ చేసుకోవడాన్ని బట్టి చూస్తే సినిమాని నిలబెట్టాలి అనే ప్రయత్నం కావచ్చు. ఈ పార్టీకి నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ లో పనిచేసిన వాళ్ళు, పనిచేయబోతున్న వాళ్ళు కూడా హాజరయ్యారు. మెహర్ రమేష్ మాత్రం మహేష్ తరుపు కాబట్టి హాజరయ్యాడు. అయితే ఈ చిత్రం సంగీత దర్శకుడు తమన్ మాత్రం హాజరుకాలేదు. సర్కారు వారి పాట కి తమన్ పాటల వల్లే హైప్ పెరిగింది. కానీ సినిమాకి అతను సరైన ఆర్.ఆర్ ఇవ్వలేదు. దీని వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను కూడా ఎదుర్కొన్నాడు.
బహుశా అందుకే తమన్ రాలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క రాంచరణ్ – శంకర్ ల మూవీ కోసం అతను చెన్నై వెళ్ళాడు అంటున్నారు. బహుశా అందుకే వచ్చి ఉండడు. కానీ పార్టీ ఫోటోలో తమన్ లేని లోటు అయితే కనిపిస్తుంది.