Liger : “వాట్ లగా దేంగే” విజయ్ వార్నింగ్ !

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కాంబో లో వస్తున్న తాజా చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాలో, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, టీజర్, గ్లిమ్స్, ట్రైలర్‌ లలో విజయ్ మేకోవర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్‌ పనిలో పడింది. ప్రమోషన్స్‌ లో భాగంగా మరో అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది. ఓ ఆసక్తికర వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. #WaatLagaDenge పేరుతో ఈ యాటిడ్యూట్‌ వీడియో సాంగ్‌ ను రిలీజ్‌ చేశారు.

విజయ్‌ దేవరకొండ డైలాగ్స్‌ తో వాట్‌ లాగా దేంగే అదిరిపోయింది. అలాగే వీడియోలో విజయ్‌ దేవరకొండ మాస్‌ యాటిట్యూడ్‌, లుక్స్‌ అన్నీ కూడా చాలా సాలీడ్‌ గా ఉన్నాయి. అంతేకాకుండా సాంగ్‌, విజువల్స్‌ లలో పూరి ఫ్లేవర్‌ కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ క్రేజీ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాటను పూరి రాయగా, విజయ్‌ పాడాడు. కాగా పాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమా ఆగస్ట్‌ 25న విడుదల కానుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు