V. V. Vinayak : “సీనయ్య” మరోసారి ?

వివి వినాయక్, టాలీవుడ్ సినీ లవర్స్ కు మాస్ సినిమాలను కొత్తగా చూపించిన దర్శకుడు. స్క్రీన్ ప్లేపై గట్టి పట్టున్న వినాయక్, తన సినిమాలను ఒక లెవెల్ లో తెరకెక్కించేవారు. వినాయక్ దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది హీరోలకు మాస్ ట్రీట్ ఇచ్చారు. “ఆది” “దిల్” “ఠాగూర్” “బన్నీ” “అదుర్స్” తో పాటు మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ సినిమా “ఖైదీ నెంబర్ 150” విజయాలు సాధించాడు. అలాగే, ఈ మాస్ డైరెక్టర్ కెరీర్ లో ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. వినాయక్ చివరిగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన “రిపబ్లిక్” సినిమా, అనుకున్నంత హిట్ కాలేకపోయింది.

దీంతో దర్శకత్వానికి గ్యాప్ ఇస్తూ, హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు వినాయక్. కథలు కూడా విన్నారు. ‘శరభ’ సినిమా ఫేమ్ ఎన్. నరసింహ చెప్పిన “సీనయ్య” కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అధికారిక ప్రకటన, ఫస్ట్ లుక్ వెను వెంటనే వచ్చాయి. కానీ, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. దీని తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో “ఛత్రపతి” హిందీ రీమేక్ బిజీ ఉండటంతో, హీరో కావాలనే కళకు కాస్త బ్రేక్ ఇచ్చాడు వివి వినాయక్. “ఛత్రపతి” హిందీ రీమేక్ ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ కు చేరుకుంది. దీంతో వినాయక్ మళ్లీ హీరో కావడానికి ప్రయత్నాలను ప్రారంభించాడు.

ఓ కొత్త డైరెక్టర్ వినాయక్ కి కథ వినిపించాడట. స్టోరీ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, దీనికి నిర్మాతగా దిల్ రాజు ఉండబోతున్నారని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఈ వార్త నిజమే అయితే, మాస్ డైరెక్టర్ వినాయక్ కళ నెరవేరబోతుంది అన్నట్టే. కానీ, దీనిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు