Vishwak-Arjun : మాస్-యాక్షన్ కాంబినేషన్

యాక్షన్ హీరో అర్జున్ అంటే తెలియని వారు ఉండరు. శాండిల్ వుడ్ హీరో అయినా, తమిళ, తెలుగు భాషల్లోనూ ఈ యాక్షన్ కింగ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అర్జున్, నటన తోపాటు డైరెక్షన్, ప్రొడ్యూస్ పై కూడా ఫోకస్ చేస్తున్నాడు. దర్శకుడిగా కన్నడ, తమిళ భాషల్లోనే సినిమాలు చేశాడు అర్జున్. తెలుగులో ఇప్పటి వరకు సినిమాలు చేయలేదు. కానీ, మొదటి సారి టాలీవుడ్ లో ఓ సినిమాను తెరకెక్కించేందుకు యాక్షన్ కింగ్ రెడీ అయిపోయాడు.

అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమాతో ఇటీవల విజయాన్ని అందుకున్న మాస్ క దాస్ విశ్వక్ సేన్ తో అర్జున్ సినిమా చేయబోతున్నాడు. అర్జున్ స్వంత బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తమిళం, కన్నడలో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కూతురు ఐశ్వర్యను ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమా కోసం అర్జున్ విభిన్నమైన కథను సిద్ధం చేశాడని సమాచారం. విశ్వక్ సేన్ కు, ఐశ్వర్యకు పెద్ద హిట్ వచ్చేలా అర్జున్ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

కాగ విశ్వక్ సేన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు మాస్ యాంగిల్ లోనివే. అందుకే ఈ యంగ్ హీరోను మాస్ క దాస్ అని పిలుస్తారు. అలాగే ఈ టైటిల్ తో ఓ సినిమా కూడా రాబోతుంది. ఇలాంటి మాస్ హీరోతో యాక్షన్ కింగ్ అర్జున్ సినిమా అంటే, అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అందులోనూ అర్జున్ తన కూతురిని టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడు. దీంతో సినిమా ఓ రేంజ్ లో ఉండటం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు