Virata Parvam : ప్రీమియర్ వేసి స్పాయిలర్ వద్దు అంటే ఎలా?

సినిమా చూస్తున్నప్పుడే చాలా మంది ప్రేక్షకులు వీడియోలు తీసి వాట్సప్ లో పెట్టేస్తున్న రోజులివి. ట్విట్టర్ లో, ఫేస్ బుక్, ఇన్స్టా స్టోరీస్ లో కూడా వీటిని షేర్ చేసేస్తున్నారు. ఒకప్పటిలా ఇప్పుడు ఓ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాలనే కుతూహలం ఎవ్వరికీ లేదు. సమీక్షలు చదివి సినిమాకి వెళ్దాం అన్నట్టు చూస్తున్నారు. సమీక్ష సినిమాకు పాజిటివ్ గా ఉన్నా, జనం థియేటర్ కు వెళ్తారు అన్నది కూడా అనుమానమే. అంటే సుందరానికీ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అయితే సమీక్ష నెగిటివ్ గా ఉంటే మాత్రం సినిమాను మరింతగా తొక్కేస్తు ఉంటారు ప్రేక్షకులు. ఆచార్య ఇందుకు మరో నిదర్శనం.

ఇక సినిమా కోసం ఇన్ని సోర్స్ లు ఉన్నప్పుడు సినిమాలో మెయిన్ హైలెట్ పాయింట్ ను దాచడం మేకర్స్ కు సాధ్యమా. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఫుటేజ్ బయటకి వచ్చేస్తున్న సంగతి వారికి తెలీదా. అయినా సరే విరాటపర్వం యూనిట్ సినిమా చూసిన వారు స్పాయిలర్ చేయకండి అంటూ తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. నిన్న కొంత మందికి విరాట పర్వం ప్రీమియర్ వేశారు మేకర్స్. అనంతరం ట్విట్టర్ లో ఈ పోస్ట్ పెట్టారు. ఆ విషయం పై రిలీజ్ కు ముందే వార్తలు వచ్చేశాయి. ప్రీమియర్ వేశాక కూడా ఈ విషయం సీక్రెట్ గా ఎలా ఉంటుంది?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు