Vinodhaya Sitham : హీరోయిన్ ను మార్చేశారా ?

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ‘వినోదయ సీతమ్’ రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సముథ్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుకూలంగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ చిత్రంలో టైం కు రూపం ఉంటే ఎలా ఉంటుందో అలాంటి పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు భోగట్టా. కథ ఆధారంగా ఈ సినిమాలో పవన్ కు హీరోయిన్ ఉండదు. కానీ, సాయి ధరమ్ తేజ్ పాత్రకు మాత్రమే హీరోయిన్ ఉంటుంది. అందుకోసం మొదట ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మను ఎంపిక చేసుకున్నారు.

కానీ, తాజాగా ఈ హీరోయిన్ ను తప్పించి ‘భీమ్లా నాయక్’ లో రానా భార్యగా నటించిన సంయుక్త మీనన్ ను ఎంపిక చేసుకున్నట్టు టాక్ నడుస్తుంది. కేతిక స్థానంలో సంయుక్తను తీసుకోవాలని త్రివిక్రమ్ సూచించాడట. ఈ మాటల మాంత్రికుడి సూచన మేరకే, సంయుక్తను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను రెడీ చేయడంతో పాటు సహా నిర్మాతగా కూడా ఉంటున్నాడు.

ఈ మధ్య కాలంలో పవన్ చేస్తున్న సినిమాల విషయంలో తెర వెనుక నుండి త్రివిక్రమ్ పాత్ర ఎక్కువగా ఉంటుందనే టాక్ ఇండస్ట్రీలో రోజు రోజుకీ ఎక్కువవుతుంది. తాజాగా కేతిక, సంయుక్త విషయంలో అది మరోసారి నిజమయ్యేలా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు