Vikram : కోలీవుడ్ స్టార్ హీరోకు గుండె పోటు

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఈ స్టార్ మీరో చికత్స తీసుకుంటున్నాడు. అసలు విషయం ఏంటంటే, హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చిందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చియాన్ విక్రమ్ ఆరోగ్యం గురించి, గుండె పోటు గురించి పోస్టులు వస్తున్నాయి. కానీ, విక్రమ్ కు ఎలాంటి గుండెపొటు రాలేదని సమాచారం. విక్రమ్ కు తీవ్ర జ్వరం రావడంతోనే ఆస్పత్రికి వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు వెళ్లడించాయి. దీంతో ఈ రోజు ఉదయం నుండి వస్తున్న వార్తలకు బేక్రులు పడ్డాయి.

జూలై 2019లో విడుదలైన ‘కదరం కొండన్’ విక్రమ్ నటించిన చివరి సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే సంవత్సరం, ధృవ్ విక్రమ్ నటించిన ఆదిత్య వర్మ చిత్రంలో కూడా విక్రమ్ ఒక పాటలో అతిథి పాత్రలో కనిపించాడు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మహాన్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది. ప్రస్తుతం విక్రమ్ లైనప్‌లో ఆర్ అజయ్ జ్ఞానముత్తుతో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో స్పై థ్రిల్లర్ ధృవ నక్షత్రం ఉన్నాయి. అలాగే మణిరత్నంతో ఎపిక్ హిస్టారికల్ ఫిక్షన్ పొన్నియిన్ సెల్వన్ 1 చేస్తున్నాడు.

పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లు ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్స్ తోనే సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అలాగే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పొన్నియిన్ సెల్వన్ 1 టీజర్ విడుదల కాబోతుంది. ఇలాంటి సమయంలో విక్రమ్ కు గుండె పోటు అనే వార్తలు ఫ్యాన్స్ న టెన్షన్ పెట్టాయి. కానీ, ప్రస్తుతం ఆస్పత్రి వర్గాల నుండి అధికారిక సమాచారం రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు