Vijay: థళపతి 66 టైటిల్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరోస్ లో ఇళయథళపతి విజయ్ ఒకరు. తెలుగు లో పవన్ కళ్యాణ్ కి ఉన్నంత క్రేజ్, తమిళ్ లో విజయ్ కి ఉందని చెప్పొచ్చు. అలానే విజయ్ కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ఉంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విజయ్, తుపాకీ,అదిరింది,విజిల్ సినిమాలతో హిట్ లు కొట్టాడు.

రీసెంట్ గా నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన బీస్ట్ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడకపోయినా, విజయ్ తదుపరి సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి కారణం విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడైన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడం. విజయ్ ప్రస్తుతం తలపతి 66 అనే ద్విభాషా ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రానికి “వరిసు” అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు మేకర్స్
అధికారికంగా ప్రకటించారు. జూన్ 22న థళపతి పుట్టినరోజు సంధర్బంగా జూన్ 21న ఈ టైటిల్ ను ప్రకటించింది మూవీ టీం. “వరిసు” లో విజయ్‌కి జోడీగా ప్రముఖ నటి రష్మిక మందన్న నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు