Vijay Sethupathi : విలన్ కాదా ?

విజయ్ సేతుపతి, కోలీవుడ్ నటుడే అయినా, సౌత్ లో అందరికీ సుపరిచితమైన పేరు. వైవిధ్యభరితమైన పాత్రలు ఉన్న కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగాడు. విజయ్ లాంటి నటుడు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందరి హీరోల్లా కమర్షియల్ సినిమాలు చేయాలని అనుకోడు. కమర్షియల్ సినిమాలు చేయడా అంటే, చేస్తాడు. స్టోరీ, తాను చేయబోయే పాత్ర నచ్చితే ఎలాంటి సినిమాల్లో అయినా చేస్తాడు విజయ్. అది హీరో అయినా, విలన్ అయినా, చివరకి హిజ్రా క్యారెక్టర్ అయినా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు.

కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొన‌సాగుతూనే, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు, విల‌న్ పాత్ర‌ల్లో నటించి, విజయ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దళపతి విజయ్ “మాస్టర్”, వైష్ణవ్ “ఉప్పెన” సినిమాలో విజయ్ విలనిజానికి మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల వచ్చిన విక్రమ్ సినిమాలో విలన్ గా విజయ్ విశ్వరూపం చూపించాడు. వీటి తర్వాత విజయ్ హీరోనే కాదు, విలన్ పాత్రలకు సంబంధించిన అవకాశాలు కూడా వస్తున్నాయి. కానీ, వాటి ఎంపికలో విజయ్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.

అయితే, గత కొద్ది రోజుల నుండి ఇండస్ట్రీలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప పార్ట్ 2 వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. కీలక పాత్ర అంటే, విలన్ పాత్రే అని రూమర్స్ ఇప్పటికే వచ్చాయి.

- Advertisement -

విజయ్ సేతుపతి ఇప్పటికే మూడు సినిమాల్లో విలన్ పాత్రలు చేయడంతో ఈ వార్తలకు కాస్త బలం చేకూరింది. ఈ వార్తలపై పుష్ప పార్ట్ 2 మేకర్స్ అధికారిక ప్రకటన చేయకపోవడంతో, ఈ వార్తలు ఇంకా వస్తునే ఉన్నాయి.
తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పుష్ప ది రూల్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ చేయడం లేదట. అల్లు అర్జున్ కు స్నేహితుడి పాత్రలో ఈ మక్కల్ సెల్వన్ కనిపించబోతున్నారని ఈ వార్తల సారాంశం. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు.

మేకర్స్ నుండి విజయ్ సేతుపతి పాత్ర గురించి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.
ఈ రూమర్స్ గురించి పక్కన పెడితే, పుష్ప ది రూల్ షూటింగ్ ఇంకా స్టార్ట్ కావాల్సి ఉంది. ఫస్ట్ పార్ట్ కంటే, బెటర్ అవుట్ పుట్ రావాలని డైరెక్టర్ సుకుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు