Chaari 111 Trailer : వీడు ఎప్పటికీ కమెడియనే హీరో కాదు

Chaari 111 Trailer

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ “చారి 111”. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కు జోడిగా తమిళ హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్ నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్, గోల్డీ నిస్సి కీలక పాత్రలో నటించగా, ఈ మూవీని బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై అదితి సోనీ నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మార్చ్ 1న థియేటర్ల రాబోతోంది. సినిమా రిలీజ్ కు టైం దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్స్ షురూ చేశారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన కాన్సెప్ట్ టీజర్, పోస్టర్లకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. తాజాగా రిలీజ్ అయిన ఫన్ ఫిల్డ్ ట్రైలర్ హిలేరియస్ గా ఉంది.

సీనియర్ నటుడు మురళీ శర్మ 1992లో ఇండియా, పాకిస్తాన్ జాయింట్ అగ్రిమెంట్ ప్రకారం ఎటువంటి కెమికల్, బయోలాజికల్ వెపన్స్ తయారు చేయకూడదని చెప్పే డైలాగ్ తో షురూ అయిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది. రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీకి మురళి శర్మ హెడ్ కాగా, చారి అందులో ఏజెంట్ గా పని చేస్తాడు అన్న విషయాన్ని ట్రైలర్ ద్వారా వెల్లడించారు. చారి అసిస్టెంట్ పాత్రలో తాగుబోతు రమేష్ కనిపిస్తుండగా, మూడు రోజుల్లో ఏడు బ్లాస్టులు ప్లాన్ చేసిన టెర్రరిస్టులను వీళ్ళు ఎలా పట్టుకున్నారు? అసలు మ్యాడ్ సైకో సైంటిస్ట్ కథేంటి? చారి ఎందుకు తన బాస్ దగ్గర తిట్లు తింటాడు? అనే విషయాలను ఫన్నీగా చూపించారు. ఇక ట్రైలర్ చివరలో హీరోయిన్ చేత తన మీద తానే సెటైర్లు వేయించుకొని అందరిని నవ్విస్తున్నాడు వెన్నెల కిషోర్. నువ్వు ఎప్పటికీ హీరోవి కాలేవు, కమెడియన్ వే అంటూ హీరోయిన్ కామెంట్ చేయగా, ఆ తొక్కలే అంటూ వెన్నెల కిషోర్ కామెడీగా తీసుకోవడం ఫన్నీ గా ఉంది.

ఇక సినిమాలో బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ కేజిఎఫ్ లో రాఖి భాయ్ చెప్పిన వైలెన్స్ డైలాగును కూడా తనదైన శైలిలో మార్చి వెన్నెల కిషోర్ వాడేసుకున్నారు. వెన్నెల కిషోర్ “చారి 111” సినిమాతో వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” మూవీకి పోటీగా రాబోతున్నారు. అయితే చారి 111″ ట్రైలర్ చూస్తుంటే మంచి కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు వెన్నెల కిషోర్. మరి ఈ సినిమా ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చి పెడుతుందా అనేది తెలియాలంటే వెయిట్ అండ్ సి. గతంలో వెన్నెల కిషోర్ హీరోగా “వన్ అండ్ హాఫ్” అనే మూవీ వచ్చింది. కానీ అది పెద్దగా ఆడలేదు. దీంతో వెన్నెల కిషోర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు