Venky-Rana : సల్మాన్ తో బాబాయ్, షారుఖ్ తో అబ్బాయ్ ?

ఈ మధ్య కాలంలో మార్కెట్ కోసం ఓ భాషకు చెందిన స్టార్ హీరోలు మరో భాషలో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. కాబట్టి తెలుగు నటీనటులకు కూడా డిమాండ్ పెరిగింది. పక్క భాషల్లో ఏదైనా పెద్ద చిత్రాన్ని తెరకెక్కిస్తుంటే, అందులో మన తెలుగు స్టార్స్ కూడా ఉండాలి అని మేకర్స్ భావిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీ బాలీవుడ్ అయితే, ప్రస్తుతం మొత్తం టాలీవుడ్ పైనే ఆధారపడుతుందని చెప్పొచ్చు.

ఇప్పటికే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమా నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అలాగే ‘లాల్ సింగ్ చద్దా’ లో నాగ చైతన్య నటించారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కబీ ఈద్ కబీ దివాలీ’ అనే చిత్రంతో వెంకటేష్ కూడా బాలీవుడ్ మెట్లు ఎక్కేశాడు. ఇప్పుడు రానా వంతు వచ్చింది.

హిందీ సినిమాల్లో రానా నటించడం కొత్తేమి కాదు. నిజానికి బాలీవుడ్ లో రానాకు మంచి మార్కెట్ ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చి రానా, ఇప్పుడు మళ్ళీ హిందీలో బిజీ కావాలని భావిస్తున్నాడు. షారుఖ్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘జవాన్’ అనే చిత్రంలో రానా కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి, సౌత్ లో ఉన్న క్రేజీ నటులను ఎంపిక చేసుకోవాలి అని అట్లీ అండ్ టీం భావిస్తున్నారు. అలా తెలుగు నుండి రానాను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు