Venky Kudumula : చిరు నో చెబితే, మహేష్ వద్దకే ?

మహేష్ బాబు ఈ మధ్య కాలంలో మిడ్ రేంజ్ సినిమాలు తీసే దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అనిల్ రావిపూడి, పరశురామ్ ముందు మిడ్ రేంజ్ దర్శకులే. కానీ, వీళ్లతో మహేష్ బాబు సినిమాలు చేశాడు. 30 కోట్ల బడ్జెట్ లో సినిమాలు తీసుకునే ఆ దర్శకులకు, 100 కోట్ల ప్రాజెక్టులు అప్పగించాడు మహేష్. ఆ రెండు కూడా మంచి ఫలితాలను అందించాయి. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు త్రివిక్రమ్, రాజమౌళి తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.

కానీ, ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైం పట్టేలా ఉంది. ఈ గ్యాప్ లో ఒకటి లేదా రెండు సినిమాలు చేయాలని మహేష్ భావిస్తున్నాడని తెలుస్తుంది. మహేష్ తో సినిమాలు చేయడానికి, అనిల్ రావిపూడి, పరశురామ్ క్యూలో ఉన్నారు. కానీ, నాగ చైతన్యతో పరశురామ్, బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమాలను ఓకే చేసుకున్నారు. కాబట్టి ఈ దర్శకులతో మహేష్ సినిమా చేసే అవకాశం లేదు.

కానీ, ఈ స్థానాన్ని వెంకీ కుడుముల భర్తీ చేయాలని చూస్తున్నారు అని వినికిడి. నిజానికి వెంకీ చిరుతో సినిమా చేయాలి. కానీ స్క్రిప్ట్ ఇంకా ఓకే కాలేదు. చిరు కనుక ఓకే చేయకపోతే మహేష్ ను ఒప్పించే పనిలో వెంకీ ప్లాన్ చేసుకుంటున్నారు అని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు