Ajay Bhupathi: ఈ ఫ్రైడే 3 సినిమాలు..విజేత ఆ సినిమానేనా..?

శుక్రవారం వచ్చిందంటే థియేటర్లలో కొత్త సినిమాల సందడి కనిపిస్తుంది. ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలు విడుదలైనట్టే ఈ వారం కూడా మూడు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మంగళవారం సినిమా కూడా ఒకటి. అజయ్ భూపతి చివరగా మహాసముద్రం సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచాడు. కానీ ఈసారి మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అంతే కాకుండా మంగళవారం సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో హైప్ ను పెంచేసింది. ఈ సినిమాకు ఇప్పటికే ప్రశంసలు అందుతున్నాయి.

అంతే కాకుండా మంగళవారం చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద హిట్ కొట్టబోతుందనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ శుక్రవారం సప్త సాగరాలు దాటి సైడ్ B సినిమా కూడా విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. ఈ సినిమా కన్నడ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. రక్షిత్ శెట్టి ఇప్పటికే తెలుగులో చార్లీ 777 సినిమాతో అభిమానులను సంపాదించుకున్నాడు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. దాంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. దీంతో పాటూ స్పార్క్ అనే మరో చిన్న సినిమా కూడా ఈ వారం ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ఈ సినిమాలో వికాంత్ హీరోగా నటించి దర్శకత్వం వహించాడు.

- Advertisement -

మెహ్రీన్, రుక్సార్ దిల్హాన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అయితే ఈ వారం విడుదల కాబోతున్న మూడు సినిమాలు చిన్న సినిమాలే కాగా వీటిలో స‌ప్త స‌రాగాలు దాటి, మంగ‌ళ‌వారం పై అంచ‌నాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మొత్తానికి మూడు సినిమాలు ప్రేక్షకుల‌ దృష్టిని ఆక‌ర్షించ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఏ సినిమా నిల‌బ‌డుతుంది..? ఏ సినిమా బోల్తా కొడుతుంది అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక ఈ సినిమాల రిజల్ట్ తెలియాలంటే రేపు బొమ్మ ప‌డేవ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు