Trolling on Deepika Padukone : దీపికా ప్రెగ్నెన్సీ ఫేక్… ట్రోలింగ్ పై బాలీవుడ్ స్టార్స్ ఫైర్

Trolling on Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ ఏడాది ప్రారంభంలో గర్భం దాల్చినట్లు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కొంటోంది. అయితే ఆమెపై జరుగుతున్న ట్రోలింగ్ పై మండిపడుతూ పలువురు ప్రముఖులు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. కాబోయే తల్లిని అవమానించే ట్రోల్స్‌కు గట్టిగా ఇచ్చిపడేస్తున్నారు.

దీపికా పదుకొణెపై ట్రోల్..

బాలీవుడ్ లోని స్టార్ కపుల్స్ లో ఒకరైన రణవీర్ సింగ్‌, దీపికా తమ మొదటి బిడ్డకు త్వరలోనే స్వాగతం పలకబోతున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న దీపికా పెద్దగా బయట కన్పించట్లేదు. పూర్తిగా రెస్ట్ మోడ్ లో ఉంది. అయితే మే 20న ఆమె ముంబైలో జరిగిన లోక్‌సభ ఎన్నికల 2024 ఐదవ దశలో తన ఓటు వేయడానికి బయట కాలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లలో ఒక వర్గం ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమె శరీరం గురించి అసహ్యకరమైన కామెంట్స్ చేయడమే కాకుండా, దీపికా బేబీ బంప్ “ఫేక్” అని అంటున్నారు. అప్పుడు స్టార్ట్ అయిన ఈ ట్రోలింగ్ ఇంకా నడుస్తోంది.

ట్రోలింగ్ పై స్ట్రాంగ్ కౌంటర్

దీపికపై కొనసాగుతున్న ట్రోలింగ్ పై సీనియర్ జర్నలిస్ట్ ఫాయే డిసౌజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీపికకు సపోర్ట్ తెలుపుతూ బలమైన పదాలతో కూడిన పోస్ట్‌ను రాశారు. తన పోస్ట్‌లో ఫాయే “ప్రియమైన సోషల్ మీడియా. దీపికా పదుకొనే తన ప్రజాస్వామ్య కర్తవ్యం నిర్వర్తించడంలో భాగంగా ఓటు వేయడానికి బయలు దేరింది. ఆమె శరీరం లేదా ఆమె గర్భం గురించి మీ అభిప్రాయాన్ని అడగలేదు. ఆమె జీవితంలోని ఏ అంశంపైనైనా వ్యాఖ్యానించే హక్కు మీకు లేదు. ట్రోలింగ్ ఆపండి. మనుషుల్లా ప్రవర్తించండి” అంటూ ఘాటుగా రాసుకొచ్చింది.

- Advertisement -

Deepika Padukone REACTS to Alia Bhatt's Met Gala 2023 debut amid online criticism – India TV

దీపికా పదుకొణెకి అలియా భట్ సపోర్ట్

దీపికకు మద్దతుగా ఫాయే చేసిన పోస్ట్‌కు అలియా వెంటనే లైక్ చేసింది. అంటే ఈ లైక్ ద్వారా తన అభిప్రాయం కూడా ఇదేనంటూ దీపికకు సపోర్ట్ చేసింది అలియా. ఆమె మాత్రమే కాదు అలియా సోదరీమణులు పూజా భట్, షాహీన్ భట్, ఆమె తల్లి సోనీ రజ్దాన్ కూడా పోస్ట్‌ను లైక్ చేసారు.

దీపికకు ప్రముఖుల మద్దతు

ఫాయే పోస్ట్‌పై నటి శృతి సేథ్, టెలివిజన్ నటి టీనా దత్తాతో పాటు పలువురు ప్రముఖులు స్పందించారు. అలాగే దీపికా అభిమానులు కూడా ఆమెపై జరుగుతున్న ట్రోలింగ్ ను ఖండిస్తున్నారు.

దీపికా ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్

దీపికా పదుకొణె ఈ ఏడాది ప్రారంభంలో తన భర్త రణవీర్ సింగ్‌తో కలిసి మొదటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నాం అని ప్రకటించింది. డిసెంబర్ 2018లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ మొదటి బిడ్డను ఆహ్వానించబోతున్నట్టు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దీపికా రెస్ట్ తీసుకుంటోంది. ఆమె వచ్చే నెల రిలీజ్ కానున్న కల్కి 2898 ఏడీ మూవీలో కీలక పాత్రలో కంపించబోతోంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు