Heroines : కన్న వాళ్ల మీదే కేసు పెట్టిన హీరోయిన్స్..!

సెలబ్రిటీలు బయటకు కనిపించినంత హుందాగా, లగ్జరీగా..తమ వ్యక్తిగత జీవితంలో ఉండరు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ మాటలు అందరికీ వర్తించవు.. కానీ కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం ఎప్పటికీ విషాదకరమే.. అలా ఇప్పటికే అయిన వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్లు కూడా ఉన్నారు.. అలాంటి వారిలో షకీలా సావిత్రి వంటి వాళ్ళ పేర్లు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి.అయితే ఆపద వస్తే ఆదుకోవాల్సిన కన్నవాళ్లే తమను నరకయాతనకు గురి చేశారంటూ.. కోర్టుమెట్లు ఎక్కిన హీరోయిన్లు కూడా ఉన్నారు.. అలా కన్నవాళ్ళ పైన కేసు పెట్టి వార్తల్లో నిలిచిన హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం..

వనిత విజయ్ కుమార్..

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వనిత విజయ్ కుమార్ ముగ్గురిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఒకరితో కూడా కలిసి జీవించడం లేదు.. అలాగే ఆస్తి విషయంలో తన తండ్రి విజయ్ కుమార్ తో కూడా గొడవలు పడింది.. ఒకానొక సమయంలో తనను చాలా విసిగించిందని.. వనిత విజయ్ కుమార్ పై విజయ్ కుమార్ ఎయిర్పోర్ట్ లో చేయి కూడా చేసుకున్నారు.. ఇకపోతే ఆస్తుల విషయంలో వనిత విజయ్ కుమార్ తండ్రి మీద కేసు వేసింది.. పెద్ద కూతురైన తనకు విజయ్ కుమార్ ఎలాంటి ఆస్తి ఇవ్వలేదని ఆరోపణలు చేసింది. అంతేకాదు ఈ వివాదం చాలా కాలం నడిచింది.. అలా కన్నవాళ్ళపై కేసు పెట్టి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

సంగీత:

తెలుగు, తమిళ్ భాషా చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈమె దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం సినిమా ద్వారా “ఒకే ఒక్క ఛాన్స్” అనే డైలాగ్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జగపతిబాబు, శ్రీకాంత్, బాలకృష్ణ వంటి హీరోలకు జోడిగా నటించింది. ఈమె కూడా తన తల్లి తనను డబ్బు కోసం ఇంట్లో నుంచి గెంటేసిందని తల్లి పై కేసు పెట్టింది. డబ్బు కోసమే తన తల్లి తనను ఇండస్ట్రీకి తీసుకొచ్చిందని.. తన డబ్బు మొత్తాన్ని వాడుకొని ఇంకా డబ్బు సంపాదించమని ఇబ్బంది పెడుతోంది అంటూ కోర్టులో కేసు కూడా వేసింది. అలా తల్లి పై కేస్ వేసి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న సంగీత సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ రష్మిక మందాన తల్లి పాత్ర చేసింది. ఆ తర్వాత మసూద చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషించింది.

ఖుష్బూ..

90లలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు పలు బుల్లితెర షోలలో జడ్జిగా చేస్తూ కొనసాగుతున్న ఈమె గతంలో తన తండ్రిపై కేసు పెట్టింది. తన చిన్నతనంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని తెలిపింది. చాలా సంవత్సరాల తర్వాత తన తండ్రి గురించి ఆశ్చర్యకర విషయాలను వెలుగులోకి తెచ్చింది. అంతేకాదు తన తండ్రి కారణంగా అత్యంత వేదనకు గురయ్యానని తెలిపింది.. చైల్డ్ అబ్యూస్ విషయంపై మాట్లాడుతూ.. బాల్యంలో తనకు ఎదురైన అనుభవాలు కూడా గుర్తు చేసుకుంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు