The Warriorr Trailer : మాస్ ట్రీట్ !

‘చాక్లెట్ బాయ్ లా కనిపించే రామ్ లో మాస్ హీరో కూడా ఉన్నాడు’ అని తన తొలి చిత్రం ‘దేవదాసు’ తోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ‘జగడం’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ‘ఒంగోలు గిత్త’ లాంటి చిత్రాలు బెడిసికొట్టడంతో మళ్ళీ మాస్ జోనర్ ను టచ్ చేయడానికి రామ్ చాలా టైం తీసుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో ఊర మాస్ గా కనిపించి తన ఇమేజ్ ను, మార్కెట్ ను మరింత పెంచుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘రెడ్’ కూడా పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ అనే చిత్రం చేశాడు. ఇది కూడా మాస్ మూవీనే కావడం విశేషం.

కెరీర్ లో రామ్ మొదటి సారి పోలీస్ ఆఫీసర్ గా చేసిన మూవీ ఇది. పోలీస్ పాత్రకు రామ్ బాడీ లాంగ్వేజ్ సెట్ అవుతుందా అని మొదట్లో అనుమానాలు ఉండేవి. కానీ, తాజాగా విడుదలైన ట్రైలర్ తో ఆ డౌట్ లు తీరిపోయాయి. ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. మాస్ ఆడియన్స్ కి, రామ్ అభిమానులకు కావాల్సినన్ని మాస్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. రామ్ ను ఢీ కొట్టే విలన్ గా కరెక్ట్ గా సెట్ అయ్యాడు ఆది. ఈ సినిమా కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్టు ట్రైలర్ తో తెలుస్తోంది.
మొత్తంగా ది వారియర్ ట్రైలర్ మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది.
ఈ సినిమా జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు