2023: ఏడాది అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న విలన్ ఎవరంటే..?

2023: వెండితెర మీద హీరోయిజం బాగా పండాలి అంటే అందుకు ధీటుగా విలన్ పాత్ర కూడా ఉండాలి. విలన్ పాత్ర డామినేట్ చేసినప్పుడే హీరో క్యారెక్టర్ బయటపడుతుంది. అంతలా హీరో ని హైలెట్ చేస్తూ.. తమ టాలెంట్ ని బయటకు తెప్పించే విలన్ సినిమాకి వెన్నెముక లాంటివారు అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పుడు చాలామంది స్టార్ హీరోలు ఒకానొక సమయంలో ఒక వెలుగు వెలిగి అవకాశాలు తగ్గినప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మారి తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే విలన్ లు కూడా హీరోలతో నటనలోనూ , పారితోషకంలోనూ పోటీ పడుతూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. మరి ఈ ఏడాది అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న విలన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

విజయ్ సేతుపతి:
ఒకానొక సమయంలో కోలీవుడ్ హీరోగా పేరు దక్కించుకున్న విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెన సినిమాతో విలన్ గా మారి తన సత్తా చాటారు. ఈ సినిమా తర్వాత ఆయనకు వరుసగా విలన్ పాత్రలు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే దాదాపు 5 సంవత్సరాల తర్వాత సినీ ఇండస్ట్రీలోకి పఠాన్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు షారుక్ ఖాన్. ఈ సినిమా తర్వాత జవాన్ సినిమా చేసి రికార్డ్ సృష్టించారు. ఇక జవాన్ లో విజయ్ సేతుపతి విలన్ గా నటించి తన నటనతో మరొకసారి ప్రేక్షకులను అబ్బురపరిచారు. అంతేకాదు ఈ సినిమాలో విలన్ గా నటించినందుకు ఏకంగా రూ.21 కోట్లు పారితోషకం తీసుకొని రికార్డు సృష్టించారు.

జాన్ అబ్రహం:
ఏడాది పఠాన్ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో రూ.1000 కోట్ల క్లబ్లో చేరిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పఠాన్ సినిమాలో జాన్ అబ్రహం విలన్ గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా నటించినందుకు గాను ఆయన ఏకంగా రూ.20 కోట్ల పారితోషకం తీసుకున్నారు.

- Advertisement -

సంజయ్ దత్:
లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం లియో.. ఈ సినిమా కథపరంగా ప్రేక్షకులను మెప్పించకపోయినా దసరా సెలవుల నేపథ్యంలో కలెక్షన్లను బాగానే రాబట్టింది. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటించారు. ఆ పాత్రకు గాను ఆయన రూ.8కోట్ల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం

ఇమ్రాన్ హష్మీ:
టైగర్ 3 లో విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మీ కూడా రూ.8కోట్లు తీసుకున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు