Rajasaab : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల్లో ” ది రాజాసాబ్” ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాని మారుతి దర్శకత్వం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రభాస్ చాలా ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ జోనర్ లో చేస్తున్న పక్కా మాస్ మసాలా మూవీ కాబట్టి అభిమానుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో గాని, లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజాసాబ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల వరకు కల్కి సినిమా ప్రమోషన్లలోనే బిజీగా ఉన్న ప్రభాస్, ఆ తర్వాత వెకేషన్లకు కూడా వెళ్లొచ్చి, ఇప్పుడు మళ్ళీ సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొనగా, ఈ సినిమా షూటింగ్ గురించి తాజా సమాచారం వచ్చింది.
నాన్ స్టాప్ గా రాజాసాబ్ షూటింగ్…
ఇక రాజాసాబ్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం శంషాబాద్ ఏరియాలో షూటింగ్ జరుగుతోంది. సినిమాలో హీరోయిన్స్ & కమెడియన్స్ పై కొన్ని కీలక సన్నివేశాలని షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఇక షూటింగ్ పరంగా రాజాసాబ్ సినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా పూర్తి చేసుకుంది. మొన్నటివరకు ప్రభాస్ తో కొన్ని సీన్లు తీయగా, ఇప్పుడు ఇతర తారాగణంతో షూట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఒక హారర్ ఫాంటసీ వండర్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా మారుతి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి.
రాజా సాబ్ పక్కా మెస్మరైజ్ చేస్తుంది..
ఇక ది రాజా సాబ్ సినిమా గురించి నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా అందరూ అనుకున్నదానికంటే చాలా పెద్ద సినిమా అవుతుందని, రాబోయే రోజుల్లో ఓ మంచి కంటెంట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమాలో చాలా పార్ట్ వరకు గ్రాఫిక్స్ తోనే ముడి పడి ఉందని, ఆ దృశ్యాలు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే విధంగా ఉంటాయని తెలిపారు. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహనన్ సహా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కానుందని సమాచారం.