Chiranjeevi: జోష్ టీమ్ తో చేతులు కలిపిన భోళా శంకర్ మేకర్స్!

టాలీవుడ్ లో క్రేజీ సినిమాల్లో ఒకటిగా రాబోతున్న “భోళా శంకర్” రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ సరికొత్త ప్రమోషన్లతో ముందుకు వెళ్తున్నారు. రీమేక్ సినిమా అయినప్పటికీ ఆడియన్స్ దృష్టిలో ఆ మాట రాకుండా తమ ప్రమోషన్ లతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్స్, పాటలు డీసెంట్ గా ఉండి ఆకట్టుకున్నాయి.

తాజాగా భోళా శంకర్ మేకర్స్ ప్రముఖ షార్ట్ వీడియోస్ యాప్ అయిన “జోష్” యాప్ టీమ్ తో కలిసి తమ ప్రమోషన్లను చేస్తున్నారని సమాచారం అందింది. జోష్ యాప్ అనేది ఇండియాలో బాగా పాపులర్ అవుతున్న షార్ట్ వీడియో యాప్. ఎంతో మంది ఈ యాప్ ని ఉపయోగించి ఫేమ్ సంపాదిస్తున్నారు.

జోష్ కోసం ఇటీవల గమనించదగ్గ విషయం ఏమిటంటే, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమాలో వారి కొత్త పాట లాంచ్ ఈవెంట్ కోసం ప్రఖ్యాత ఆడియో లేబుల్ “ఆదిత్య మ్యూజిక్‌”తో కలిసి చేయడం.

- Advertisement -

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా భోళా శంకర్ మూవీలో “జామ్ జామ్ జజ్జనక” అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఆయన కుమారుడు మహతి స్వరసాగర్ భోళా శంకర్ సంగీత దర్శకుడు. అందుకే, ఆయనకు స్పెషల్ ట్రిబ్యూట్ అందించేందుకు, మహతి తన తండ్రి పుట్టినరోజున రెండవ పాటను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మెహర్ రమేష్, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్, గీత రచయిత కాసర్ల శ్యామ్, నటుడు సుశాంత్, హాస్యనటుడు ఆది, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్, సంగీత దర్శకుడు మణిశర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇక జోష్ క్రియేటర్స్ భోళా శంకర్ టీమ్‌తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని పొందారు. సాంగ్ లాంచ్ తర్వాత, భోళా శంకర్ టీమ్ సినిమాలో తమ అనుభవం, పాటల షూట్, చిరంజీవితో తమ వర్క్ అనుభవాలు మొదలైన వాటి గురించి రిపోర్టర్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇక స్టార్ నటులతో కనెక్ట్ అవ్వడానికి మరియు ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంత పెద్ద ప్లాట్‌ఫామ్ ఇచ్చినందుకు జోష్‌ టీమ్ తమ కృతజ్ఞతలు పంచుకున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు