కరోనా కారణంగా సినిమా అవార్డ్ ఫంక్షన్లు గత రెండేళ్లుగా జరగలేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి శాంతించడంతో మళ్లీ అవార్డ్ ఫంక్షన్లు ప్రారంభమవుతున్నాయి. భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ ఈ నెల 3వ తేదీన అబుదాబిలో ప్రారంభమై, శుక్రవారం ముగిసింది.
ఈ వేడుకకు సల్మాన్ ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్, మనీష్ పాల్ హోస్టింగ్ చేయగా, షాహిద్ కపూర్, విక్కీ కౌశల్, కృతి సనన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అనన్య పాండే, సారా అలీ ఖాన్, AR రెహమాన్, టైగర్ ష్రాఫ్, నోరా ఫతేహి, యో యో హనీ సింగ్, పంకజ్ త్రిపాఠి తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఉత్తమ చిత్రంగా షేర్షా సినిమా అవార్డు గెలుచుకోగా, మొత్తం 6 అవార్డులను దక్కించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- ఉత్తమ చిత్రం – షేర్షా
- ఉత్తమ దర్శకుడు – విష్ణు వరదన్ (షేర్షా)
- ఉత్తమ నటుడు – విక్కీ కౌశల్ (సర్ధార్ ఉధమ్)
- ఉత్తమ నటి – కృతి సనన్ (మిమీ)
- ఉత్తమ సహాయ నటుడు – పంకజ్ త్రిపాఠి (లూడో)
- ఉత్తమ సహాయ నటి – సాయి తంహంకర్ (మిమీ)
- ఉత్తమ నటుడు (డెబ్యూ) – అహన్ శెట్టి (తడప్)
- ఉత్తమ నటి (డెబ్యూ) – శర్వరీ వాఘ్ (బంటీ ఔర్ బబ్లీ 2)
- ఉత్తమ నేపథ్య గాయకుడు – జుబిన్ నౌటియల్ (రతన్ లంబియన్.. – షేర్షా)
- ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ – అసీస్ కౌర్ (రతన్ లంబియన్..- షేర్షా)
- ఉత్తమ సంగీతం (టై) – ఎ ఆర్ రెహమాన్ (అత్రంగి రే), తనిష్క్ బాగ్చి, జస్లీన్ రాయల్, జావేద్-మొహ్సిన్, విక్రమ్ మాంట్రోస్, బి ప్రాక్, జానీ (షేర్షా)
- ఉత్తమ సాహిత్యం – కౌసర్ మునీర్ (లెహ్రా దో… 83)
- ఉత్తమ కథ (ఒరిజినల్) – అనురాగ్ బసు (లూడో)
- ఉత్తమ కథ (అడాప్టెడ్) – (కబీర్ ఖాన్, సంజయ్ పురాన్ సింగ్, చౌహన్.. 83)