Thank You Trailer : సమంత పై సెటైరా?

నాగ చైతన్య హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘థాంక్యూ’. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న విడుదల కాబోతోంది. రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బి.వి.ఎస్ రవి కథ అందించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో నాగ చైతన్య ‘ప్రేమమ్’ చిత్రంలో మాదిరి మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు. ఇందులో కూడా హీరోకు మూడు లవ్ స్టోరీస్ ఉన్నాయని స్పష్టమవుతుంది. ఈ ట్రైలర్ కు తమన్ అందించిన నేపధ్య సంగీతం, పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలిచాయి.

’మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే, మనం చేరిన గమ్యానికి విలువుండదు అని మా ఫ్రెండ్ చెప్పాడు’, ‘ఫ్లైట్ ఎక్కడమే ఫస్ట్ టైం చిన్నప్పుడంతా నారాయణపురం’, ‘లుక్ బ్యాక్ అభి, నీ సక్సెస్ కి కారణమైన వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు’ వంటి డైలాగులు ‘థాంక్యూ’ థీమ్ ఏంటి అనేది క్లారిటీ ఇచ్చాయి.

అలాగే ఈ ట్రైలర్లో ‘ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే, స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది’ అంటూ కూడా ఓ డైలాగ్ ఉంది. అయితే ఈ డైలాగ్ చైతన్య పర్సనల్ లైఫ్ కు సింక్ అయ్యేలా ఉంది.ఈ డైలాగ్ సమంత పై సెటైర్ వేసినట్టు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు