Thalapathy : తలపతి సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్

కోలీవుడ్ తో పాటు సౌత్ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా తలపతి 67. కొన్ని సినిమాలతోనే పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ పెంచుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ తలపతి హీరోగా ఈ చిత్రం తెర్రకెక్కబోతుంది. లోకేష్ కనగరాజ్ గత చిత్రాలు ఖైదీ, విక్రమ్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి విధితమే. ఇప్పుడు తలపతి67పై కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని, ఇందులో తలపతి విజయ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు అంటూ కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోలకు సమానంగా విలన్లు కూడా బలంగా ఉంటారు. అలా తలపతి 67లో కూడా బలమైన ప్రతి నాయకులను ఎంపిక చేసే పనిలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఉన్నాడని తెలుస్తోంది. ముందుగా ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ తో పాటు గౌతమ్ మీనన్ పేర్లు వినిపించాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది.

కోలీవుడ్ సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. లోకేష్ కనగరాజ్ చెప్పిన స్టోరీకి అర్జున్ ఇంప్రెస్ అయ్యాడని వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. తలపతి67లో ప్రతినాయకుడి పాత్రలో చేస్తున్నందకు యాక్షన్ కింగ్ అర్జున్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు కూడా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. కాగా అర్జున్ ఇప్పటికే పలు సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉండగా, తలపతి67 ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. జనవరి రెండో వారం నుంచి గానీ, మూడో వారం నుంచి గానీ చెన్నైలో రెగ్యూలర్ షూటింగ్ జరిగే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు