Telugu Producer : ఇండస్ట్రీలో విషాదం… స్టార్ ప్రొడ్యూసర్‌కి మాతృ వియోగం

Telugu Producer : తెలుగు చిత్ర నిర్మాత, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ చినబాబుగా పిలుచుకునే నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ తల్లి తాజాగా మరణించారు. రాధాకృష్ణ తల్లి పేరు సూర్యదేవర నాగేంద్రమ్మ. ఆమె వయసు 90 సంవత్సరాలు. ఈరోజు అంటే మే 30న 3 గంటల సమయంలో గుండె సంబంధిత వ్యాధితో ఆమె కన్నుమూసినట్టుగా సమాచారం. నాగేంద్రమ్మకు ఇద్దరూ కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నట్టు తెలుస్తోంది. నిర్మాత రాధాకృష్ణ ఆమెకు రెండవ కుమారుడు. మరో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగ వంశీకి నాగేంద్రమ్మ నాయనమ్మ వరుస అవుతారు. రేపు అంటే మే 31న ఉదయం 10 గంటలకు ఫిలిం నగర్ లోని విద్యుత్ స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్త  తెల్సిన సినీ ప్రముఖులు నిర్మాత రాధాకృష్ణకు సంతాపం తెలియజేస్తున్నారు.

telugu-producer-producer-suryadevara-radhakrishna-mother-passes-away

నిర్మాత రాధాకృష్ణ సినిమాలు

స్టార్ ప్రొడ్యూసర్ రాధా కృష్ణను తెలుగు సినీ పరిశ్రమలో చినబాబు అని కూడా పిలుస్తారు. పలు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి ప్రముఖ తెలుగు సినిమా నిర్మాతగా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు ఆయన. అంతేకాదు రాధాకృష్ణ ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ వ్యవస్థాపకుడు. 

- Advertisement -

తన స్వంత ప్రొడక్షన్ బ్యానర్ హారిక & హాసిని క్రియేషన్స్‌పై అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి,  అఆ, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, వకీల్ సాబ్ సినిమాలు యన నిర్మించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలలో ఉన్నాయి. ఈ సినిమాలు విమర్శకుల ప్రశంసలు  అందుకోవడమే కాదు కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యాయి. రీసెంట్ గా మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీని నిర్మించారు. అంతేకాకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఎన్నో సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా చేశారు. 

నాగ వంశీకి షాక్…

నాయనమ్మ చనిపోయింది అన్న వార్త నిర్మాత నాగ వంశీకి షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ మే 31 న థియేటర్లలోకి రానుంది. మరికొన్ని గంటల్లో తాను నిర్మించిన మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో నాగవంశీకి ఈ విషాదకర వార్త అందడం గమనార్హం. రేపు ఆయన నిర్మించిన సినిమా థియేటర్లలోకి వస్తోందన్న టెన్షన్ ఒకవైపు, నాయనమ్మ చావుతో విషాదం మరోవైపు.. ప్రస్తుతం నాగ వంశీతో పాటు రాధాకృష్ణకు కూడా నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. నాగేంద్రమ్మ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

రాధాకృష్ణ కూతురు నిర్మాతగా..

సీనియర్ నిర్మాత ఎస్ రాధాకృష్ణ తన కూతురు హారిక సూర్యదేవరను నిర్మాతగా పరిచయం  చేయబోతున్నారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తన 18వ ప్రాజెక్ట్‌ను ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టుతోనే హారిక నిర్మాతగా మారబోతోంది. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఫార్చ్యూన్‌4 సినిమాస్‌  సాయి సౌజన్యతో కలిసి నాగ వంశీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు