Chiranjeevi : మళ్లీ నిరాశే..

ఆచార్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో గాడ్ ఫాదర్ కూడా ఒకటి. మలయాళంలో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన లూసిఫర్ సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాను మోహన్ రాజా దర్శకత్వం వహించగా, ఆర్ బీ చౌదరి, ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో పాటు సత్యదేవ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

అలాగే టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ను మేకర్స్ వదిలారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 21న గాడ్ ఫాదర్ టీజర్ విడుదల చేయనున్నట్టు టీం అధికారికంగా ప్రకటించారు. అలాగే దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో చిరంజీవి సీరియస్‌గా కనిపిస్తున్నాడు. బ్లాక్ షేడ్స్‌తో రఫ్ అండ్ స్టయిలిష్ లుక్ లో చిరు ఉన్నాడు.

అయితే ఈ లుక్ అభిమానులు అంచనా వేసినంతగా లేదు. సినీ లవర్స్ మాత్రమే కాదు.. కొంతమంది మెగా అభిమానులు కూడా ఈ లుక్ పై పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక ఫస్ట్ లుక్ వీడియో వచ్చింది. అప్పుడు కూడా చిరు లుక్ అంతగా నచ్చలేదు. లూసిఫర్ కు రీమేక్ అంటే, దాని కంటే కాస్త ఎక్కువే అంచనా వేస్తారు.  కానీ, చిరు లుక్ మాత్రం గాడ్ ఫాదర్ కు అసలు సెట్ అయినట్టు కూడా కనిపిస్తలేదు. మరీ ఈ నెల 21న రాబోయే టీజర్ తో అయినా, ఈ సినిమాపై అంచనాలు పెరగుతాయో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు