Shabaash Mithu: మిథాలీ పాత్రలో ఒదిగిపోయిన తాప్సీ

ఏ భాషలోనైన స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో సినిమాలు వస్తే ఆ సినిమాలకి ఉండే ఆదరణే వేరు అలా టాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఒక్కడు, భీమిలి కబడ్డీ జట్టు, సై , జెర్సీ లాంటి సినిమాలకు మంచి ఆదరణ లభించింది.
బాలీవుడ్ లో కూడా లగాన్ , బాగ్ మిల్కా బాగ్ , ఎం.ఎస్ ధోని లాంటి సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి.

ప్రస్తుతం దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం “శభాష్ మిథు”. ఈ సినిమాలో తాప్సీ పన్ను మిథాలీ రాజ్ పాత్రను పోషిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డు బద్దలు కొట్టిన మిథాలీ రాజ్, వన్డేల్లో 10000 పరుగులకు పైగా చేసింది. ఈ చిత్రంలో ఆమె లెజెండరీ క్రికెటర్‌గా మారే ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను చూపించనున్నాడు దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ.

నేడు విడుదల చేసిన “శభాష్ మిథు” ట్రైలర్ ప్రారంభం నుండి ఆద్యంతం వరకు ఆకట్టుకుంది. మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీ పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపిస్తుంది. “నీకు తెలిసిన 5 మంది లేడీ క్రికెటర్స్ పేర్లు చెప్పు” అనేటువంటి డైలాగ్స్ మనల్ని ఆలోచింపజేస్తాయి.
ఒక మహిళ ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదర్కోవాలి అని దర్శకుడు చూపించిన విధానం బాగుంది.

- Advertisement -

భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ ఈ ట్రైలర్ ను లాంచ్ చేసారు. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జూలై 15న విడుదలకానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు