SSMB28 : షూటింగ్ కు వేళాయరా !

సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి చిత్రాల తర్వాత వరుసగా సినిమాలు సాలిడ్ హిట్ కొడుతున్నాయి. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు తో పాటు ఇటీవల వచ్చిన సర్కారు వారి పాటతో అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చాడు ప్రిన్స్. భారీ అంచనాలతో మే 12వ తేదీన విడుదల అయిన సర్కారు వారి పాట, థియేటర్స్ లో 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ బాబు 28వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా, ప్రతి సినిమా తర్వాత వెకేషన్ కు వెళ్లడం మహేష్ కు అలవాటు. సర్కారు వారి పాట హిట్ కావడంతో ఈ సారి వెకేషన్ ను సూపర్ స్టార్ కాస్త గ్రాండ్ గానే ప్లాన్ చేశాడు. ప్రస్తుతం మహేష్ తన ఫ్యామిలీతో కలిసి ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నాడు. వెకేషన్ లో ఉన్నా, తన తర్వాత సినిమా గురించి ఫోకస్ మాత్రం తగ్గించలేడు. స్టోరీలో మహేష్ కోరుకున్న మార్పులను త్రివిక్రమ్ చేత జర్మనీలోనే చేశాడట. అలాగే థమన్ తో సంగీతానికి సంబంధించిన చర్చలు కూడా జరిపేశారట.

- Advertisement -

దాదాపు అన్ని పనులు పూర్తి చేసుకుని షూటింగ్ కు రెడీ గా ఉన్నారని సమాచారం. వెకేషన్ నుండి మహేష్ వచ్చి రాగానే షూటింగ్ స్టార్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే జులై రెండో వారంలో SSMB28 సెట్స్ పైకి వెళ్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే సర్కారు వారి పాట హిట్ తో హ్యాపీ మూడ్ లో ఉన్న మహేష్ ఫ్యాన్స్ కు ఇదొక శుభవార్తయే.

కాగ త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వచ్చే హ్యాట్రిక్ మూవీ కావడంతో మొదటి నుండో అంచనాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు ఈ సినిమాలో మహేష్ పాత్రను త్రివిక్రమ్ కొత్తగా డిజైన్ చేశాడని, సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ భారీగా ఉంటాయని గత కొద్ది రోజుల నుండి ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ అవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు