ద్వారకా క్రియేష‌న్స్‌తో శ్రీ‌కాంత్ అడ్డాల కొత్త ప్ర‌యోగం..!

కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ఆడియన్స్‌కి డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాతో ప్రేక్షకులకు వారి కాలేజ్ డేస్ గుర్తు చేసి మంచి హిట్ కొట్టాడు. సెకండ్ సినిమాతోనే ఇద్దరి టాప్ హీరోలను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. మహేష్, వెంకటేష్‌తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెరకెక్కించి టాలీవుడ్‌లో మల్టీస్టారర్ ట్రెండ్ రీ క్రియట్ చేశాడు. నెక్ట్స్ మెగ్ ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని ముకుందా సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇది కమర్షియల్‌గా హిట్ కాకపోయినా.. టేకింగ్‌లో శ్రీకాంత్‌కి, యాక్టింగ్‌లో వరుణ్‌కి మంచి మార్కులు పడ్డాయి. తరువాత బ్రహ్మోత్సవం మూవీ కాస్త నిరాశపరిచింది.

ఇలా వరుస క్లాస్ సినిమాలను చేసిన శ్రీకాంత్.. వెంకటేష్‌ నారప్పతో మాస్ ఎలిమెంట్స్ టచ్ చేశాడు. ఇలా ప్రతీసారీ తెలుగు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేసే శ్రీకాంత్ అడ్డాల కాంపౌండ్ నుంచి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. మరో కొత్త హీరోని ఈ డైరెక్టర్ తెలుగు తెరకి పరిచయం చేస్తున్నాడట. ఈ మూవీని ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై మిర్యాల ర‌వీంద‌ర్ నిర్మించ‌బోతున్నారని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. అయితే ఆ హీరో ఎవరనే విషయం ఇంకా తెలియాల్సింది. ఈ సినిమాకి సంబందించి పూర్తి వివ‌రాల‌ను అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. శ్రీకాంత్ పరిచయం చేసిన వరుణ్ తేజ్ కెరీర్ జెట్ స్పీడ్‌లో ఉంది. అలాగే ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఇటీవ‌ల వ‌చ్చిన‌ అఖండ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇప్పుడు శ్రీకాంత్, ద్వార‌కా క్రియేష‌న్స్‌ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై ఫిల్మ్ సర్కిల్‌లో ఇంట్రస్ట్ పెరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు