Shankar: భారీ మల్టీస్టారర్ – క్రేజీ ప్లాన్

ఇండియాలో ఉన్న టాప్ దర్శకులలో శంకర్ ఒకరు అనే విషయం మనందరికీ తెలిసిందే. జెంటిల్ మెన్, ప్రేమికుడు, జీన్స్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, రోబో, శివాజీ, ఐ, వంటి చిత్రాలతో ఇండియాలోనే టాప్ దర్శకులలో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నారు శంకర్. భారీ చిత్రాలకు శంకర్ పెట్టింది పేరు. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందంటే చాలు సౌత్ సినిమా ఇండస్ట్రీ దృష్టి మొత్తం ఆ చిత్రం పై పడుతుందనటంలో ఎలాంటి సందేహం ఉండదు. విభిన్న కథాంశాలు, భారీ సెట్టింగ్ లతో కూడిన చిత్రాలకు పెట్టింది పేరైన శంకర్ తాజాగా మరో సంచలనానికి తెరతీస్తున్నారని తెలుస్తోంది.

ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో భారీ చిత్రాన్ని తెరకేక్కించనున్నట్లు సమాచారం. ఎస్ వెంకటేష్ అనే రచయిత చారిత్రక నేపథ్యంలో రాసిన
“నేర్పాలి” అనే నవల ఆధారంగా శంకర్ ఈ భారీ మూవీ ని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాలో హీరో సూర్యతోపాటు కన్నడ హీరో సుదీప్ కూడా మరో హీరోగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి సూర్య – సుదీప్ హీరోలుగా తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతున్న ఈ మూవీ గురించి ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తల పై ఓ క్లారిటీ రావాలంటే శంకర్ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు