Sai Pallavi : “డాక్టర్ గా ప్రాణం విలువ తెలుసు”

సమాజంలో ప్రస్తుతం కులం, మతం, ప్రాంతం, రంగు ఇలా ఎన్నో విధాలుగా రక్త పాతం జరుగుతూనే ఉంది. ఇది ఏ ఒక్క రాష్ట్రంలోనే కాదు, కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఇదే వ్యవహారం. ఈ మధ్య కాలంలో ఘర్షణలు మరింత ఎక్కువ అయ్యాయి. ఈ రక్త పాతంపై రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా సందర్భాన్ని బట్టి స్పందించారు. అలా స్పందించిన వారిపై మాటల దాడులు కొత్తేమీ కాదు.

ఇదీల ఉండగా, ఇటీవల టాలీవుడ్ అగ్ర కథనాయక సాయి పల్లవి కూడా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన విషయం తెలిసిందే. ది కాశ్మీర్ ఫైల్స్ లో కాశ్మీర్ పండిట్ల హత్యాకాండను. గో అక్రమ రవాణా పేరిట జరిగే హత్యలకు పెద్ద తేడా లేదు. అది కశ్మీర్ లో జరిగిన హింస. ఇది భారతదేశంలోనే మరో చోట జరిగిన హింస. మనిషిలో మానవత్వం ఉండాలి. రైటా, లెఫ్టా అనేది ముఖ్యం కాదు. హింస ఎవరూ చేసిన తప్పే. అని అర్థం వచ్చేలా సాయి పల్లవి వ్యాఖ్యలు చేసింది.

ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వచ్చింది. ఒక వర్గానికి చెందిన వారు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే, మరి కొంతమంది సాయి పల్లవి మెచ్యూరిటీ సలాం అంటూ మద్దతు కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు రెండు వర్గాలు మారి, దీనిపై కొద్ది రోజుల నుండి చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే, ఈ చర్చలకు పులిస్టాప్ పెడుతూ, తాజా గా వీడియో ద్వారా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు సాయి పల్లవి.

- Advertisement -

“నేను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేరే విధంగా వెళ్లాయి. అందుకే ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. నేను మనుషులను మనుషులగానే చూస్తాను. ఒక మనిషిలో మతం, కులం కనిపించదు. ఇలాంటి వాటిపై నేను ఎప్పుడు తటస్థంగానే ఉంటాను. ఈ మధ్య కూడా అలాగే మాట్లాడాను. కానీ అది బయటకు వేరేలా వెళ్లింది. చిన్నప్పుడు స్కూల్ లో భారతీయులు అందరూ నా సహోదరులు అని చదువుకున్నాను. బహుశ అది నా మెదడులో గట్టిగా స్థిరపడిపోయింది కావచ్చు. అందుకే నేను ఇలా ఉన్నాను. హింస అనేది ఏ మతంలో చేసిన తప్పే. అదే నేను చేప్పాను. ఒక డాక్టర్ గా ప్రాణం విలువ నాకు తెలుసు” అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పటి వరకు తనకు సపోర్ట్ గా ఉన్న వారందరికీ ధన్యవాదాలు చెప్పింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు