RRR: ఆస్కార్ విజేతకు వార్నింగ్

రాజమౌళి దర్శకత్వం వహించిన RRR మార్చి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సిన ‘RRR’ Omicron కేసులు పెరగడంతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం RRR జీ-5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు 650 కోట్ల పెట్టుబడితో నిర్మింపబడిన RRR నెల రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా 1150 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గే లవ్‌స్టోరీ అని మలయాళీ ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి ప్రస్తావిస్తూ తెరపైకి వచ్చారు. రసూల్ పూకుట్టి వ్యాఖ్యలపై ‘బాహుబలి’ నిర్మాత శోబు యార్లగడ్డ విమర్శలు గుప్పించారు. రసూల్ పూకుట్టి స్పందన పూర్తిగా నిరాశపరిచిందని శోబు అన్నారు. రసూల్ పూకుట్టి (RRR)తో తాను పూర్తిగా విభేదిస్తున్నట్లు శోబు చెప్పారు.

శోబు మాట్లాడుతూ, “మీరు చెప్పినట్లు ‘ఆర్‌ఆర్‌ఆర్’ గే లవ్‌స్టోరీ అని నేను అనుకోను, అయితే ‘గే లవ్‌స్టోరీ’ చెడ్డ విషయమా? మీలాంటి వారు ఇంత దిగజారడం నిరాశపరిచింది” అని రసూల్ పూకుట్టిను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. ఒక ‘గే లవ్ స్టోరీ’ అనే వ్యాఖ్యలు అభిమానుల ఆగ్రహానికి మరియు విమర్శలకు దారితీసింది.

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ట్రిపుల్ ఆర్ లో అలియా భట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్, శ్రియ శరణ్ తదితరులు నటించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథకు, సాయి మాధవ్ బురా డైలాగ్స్ అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు