Ramarao on Duty : రామారావు ఆలోచించాడు

ఈ మధ్య కాలంలో సినిమాలు అంత సులువుగా హిట్ అవడం లేదు. మాస్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే సినిమా హిట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన విరాట పర్వం, అంటే సుందరానికీ లాంటి సినిమాలు పాజిటివ్ రివ్యూలు వచ్చినా, హిట్ ను అందుకోలేదు. పక్కా కమర్షియల్, హ్యాపీ బర్డ్ డే, ది వారియర్, థాంక్యూ గురించి తెలిసిందే. దీంతో తర్వాత వచ్చే సినిమాల మేకర్స్ బాగా ఆలోచిస్తున్నాయి.

అంటే సుందరానికీ సినిమా రన్ టైమ్ 3 గంటల వరకు ఉంది. రన్ టైమ్ ఎక్కువగా ఉండటం వల్లే, పాజిటివ్ రివ్యూలు వచ్చినా, జనాలు థియేటర్స్ రాలేరు అనే టాక్ ఉంది. అలాగే తాజా గా వచ్చిన థాంక్యూ సినిమా రన్ టైమ్ 2 గంటల 9 నిమిషాలే ఉంది. రన్ టైమ్ తక్కువగా ఉండటంతో సరైన అవుట్ పుట్ రాలేదు అనే టాక్ వచ్చింది. దీంతో రన్ టైమ్ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం లేదని అర్థమవుతుంది. సినిమాలో మంచి కంటెంట్ ఉండి, సరైన రన్ టైమ్ ఉంటే, సినిమా హిట్ అయ్యే అవకాశాలుంటున్నాయి.

ఈ విషయాన్ని మాస్ మహారాజ రవితేజ బాగనే అర్థం చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే తన రామారావు ఆన్ డ్యూటీ సినిమా రన్ టైమ్ ను అటు ఎక్కువగా కాకుండా, ఇటు తక్కువ కాకుండా చూసుకున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ రన్ టైమ్ 2 : 26 గంటలు మాత్రమే ఉంటుందట. మరి రామారావు ఆలోచన సక్సెస్ అవుతుందా. లేదా ఇటీవల వచ్చిన సినిమాల్లాగే నిరాశ పరుస్తుందా అని తెలియాలంటే, ఈ నెల 29 వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు